రచిన్ రవీంద్ర తలకు తీవ్ర గాయం- పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటంపై భయం భయం

Rachin Ravindra: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. బంతి తగలడం వల్ల అతని ముఖానికి తీవ్ర గాయమైంది. రక్తమోడుతున్న స్థితిలో అతను గ్రౌండ్‌ నుంచి బయటికి వెళ్లాల్సొచ్చింది. ఇంకొద్ది రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఈ స్థాయిలో గాయపడటం బ్లాక్ క్యాప్స్‌ను ఆందోళనలోకి నెట్టినట్టయింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు మూడు దేశాల సిరీస్‌కు ఆతిథ్యాన్ని ఇచ్చింది పాకిస్తాన్. న్యూజిలాండ్- పాకిస్తాన్- దక్షిణాఫ్రికా ఇందులో తలపడుతున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి లాహోర్‌ గడాఫి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఈ సంఘటన చోటు చేసుకుంది.

Rachin Ravindra sustaining a serious injury while fielding during Tri-series ODI against Pakistan

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిఛెల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యేకించి గ్లెన్ ఫిలిప్.. మెరుపులు మెరిపించాడు. 74 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లతో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డారిల్ మిఛెల్- 84 బంతుల్లో 81, కేన్ విలియమ్సన్- 58 పరుగులు చేయడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 331 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ చతికిలపడింది. 47.5 ఓవర్లల్లో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఫకర్ జమాన్ ఒక్కడే రాణించాడు. 69 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 84 పరుగులు చేశాడు.

పాకిస్తాన్ ఇన్నింగ్‌ 37వ ఓవర్‌లో రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. మిఛెల్ బ్రేస్‌వెల్ వేసిన బంతిని స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు పాక్ బ్యాటర్ ఖుష్దిల్ షా. గాల్లోకి లేచిన ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద అందుకోబోయాడు రచిన్. మిస్ అయ్యాడు. ఆ బంతి నేరుగా వచ్చి అతని నుదుట తాకింది. దీనితో అక్కడికక్కడే కుప్పకూలాడు. నొప్పితో విలవిల్లాడాడు. రక్తమోడుతున్న ముఖంతో టవల్ కప్పుకొని గ్రౌండ్‌ను వీడాడు.

గడాఫీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగు తక్కువగా ఉండటం వల్లే బంతి వేగాన్ని రచిన్ రవీంద్ర అంచనా వేయలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కనీస మౌలిక వసతులు సైతం సరిగ్గా లేని పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో నిర్వహించడం పట్ల ఆందోళన చెందుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు మినహా మిగిలినవన్నీ కూడా పాకిస్తాన్‌లో షెడ్యూల్ అయిన విషయం తెలిసిందే. కరాచీ, లాహోర్, రావల్పిండిల్లో జరుగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్.. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+