ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!!
T20 World Cup final India vs New Zealand: టీ20 ప్రపంచ కప్ ఊహించని అంచనాలతో చివరి దశకు చేరింది. టీం ఇండియా ఫైనల్ చేరింది. ఈ నెల7న అహ్మదాబాద్ లో కివీస్ తో టీం ఇండియా టైటిల్ పోరులో తల పడనుంది. సెమీస్ లో ఇంగ్లాండ్ ఒక దశలో గెలుపు ఖాయమనే విధంగా ప్రతాపం చూపింది. చివర్లో బూమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్.. మెరుగైన ఫీల్డింగ్ తిరిగి టీం ఇండియాను ఫైనల్ కు చేర్చాయి. అయితే, కివీస్ తో ఫైనల్ వేళ టీం ఇండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేసారు. అభిషేక్ కు మద్దతుగా నిలిచారు.
సెమీస్ లో ఇంగ్లాండ్ పైన ఉత్కంఠ భరిత విజయం సాధించిన టీం ఇండియా ఫైనల్స్ లో కివీస్ తో తల పడనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ హోరా హోరీ పోరు జరగనుంది. టీం ఇండియా పైన భారీ అంచనాలు ఉన్నాయి. కాగా.. సెమీస్ లో ఇంగ్లాండ్ పైన ఒత్తిడిని అధిగమించి భారత్ గెలిచిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఈ విజయం పైన స్పందించారు.

ఫైనల్ కు వచ్చిన కివీస్ ను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. కివీస్ సెమీస్ తో దక్షిణాఫ్రికా పైన గెలిచిన తీరు గుర్తించాలని సూచించారు. టీం ఇండియా సమిష్టిగా రాణించటం ఫైనల్ వేళ మంచి పరిణామంగా పేర్కొన్నారు. శివం దుబేకు బ్యాటింగ్ లో ప్రమోషన్ ఇవ్వటాన్ని రవి శాస్త్రి సమర్థించారు. సెమీస్ ఆడిన టీంతోనే ఫైనల్ ఆడాలని సూచించారు. అదే విధంగా సూర్య కుమార్ ఒత్తిడి వేళ టీంను నడిపిస్తున్న తీరును ప్రశంసించారు.
అభిషేక్, సంజూ కు కీలక సూచనలు
కాగా, కీలక మ్యాచుల్లో విఫలమవుతున్న అభిషేక్ శర్మకు రవిశాస్త్రి మద్దతుగా నిలిచారు. ఫైనల్ లో "అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలి. ఫైనల్ కోసం జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే 'నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకంతో ఉండు. తిరిగి పుంజుకో. ధైర్యం కోల్పోవద్దని" సూచించారు. ఫైనల్‌లో అతడు రాణించే అవకాశం ఉందని చెప్పారు. న్యూజి లాండ్‌పై అతడికి మంచి రికార్డు ఉందని గుర్తు చేస్తూ... 'మేమంతా నీ వెంటే ఉన్నాం అభి.. వెళ్లి ఆడు.
ఫైనల్‌లో నువ్వు బాగా ఆడతావు' అని రవి శాస్త్రి .. అభిషేక్ శర్మలో ప్రోత్సాహం నింపే ప్రయత్నం చేసారు. కాగా. సంజూ పైన రవిశాస్త్రి ప్రశంసలు గుప్పించారు. సంజు వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చాడన్నారు. తాను మరింత నిలకడగా ఆడాలన్న విషయాన్ని సంజు గుర్తించాడని.. అతడు ప్రస్తుతం షాట్ సెలక్షన్ విషయంలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నాడన్నారు. కానీ సంజూలో ఏకాగ్రత లోపిస్తోందని, మానసికంగా బలంగా ఉన్నాడన్నారు. మంచి గేమ్ ప్లాన్.. సమయానుకూల నిర్ణయాలతో ఒత్తిడి మరిచి ఫ్రీ గేమ్ ఆడితే.. గెలుపు ఖాయమని రవిశాస్త్రి పేర్కొన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications