Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెరీర్‌లో పాకిస్థాన్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అశ్విన్

భారత క్రికెట్ జట్టుకు చెందిన అద్భుత ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. తన అద్భుత స్పిన్ బౌలింగ్‌తో పాటు పలు సందర్భాల్లో బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతను టెస్ట్, వన్డే మరియు టి20 ఫార్మాట్లలో భారత్ తరఫున ఆడాడు. అశ్విన్ తన అద్భుతమైన ఆటతో అన్ని ఫార్మాట్లలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

అశ్విన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్లలో ఒకరు. అయితే ఎవరూ ఊహించని విధంగా రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మూడో టెస్ట్ ముగిసిన వెంటనే అశ్విన్ తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అశ్విన్ తన 14 ఏళ్ల కెరీర్‌లో భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు. అతను టెస్టు క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ స్పిన్నర్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన అశ్విన్ దాయాది దేశం అయిన పాకిస్థాన్‌తో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.

Ravichandran Ashwin has not played a single test match against Pakistan in his career

తన టెస్టు కెరీర్‌లో టీమిండియా తరుపునా ఏకంగా 106టెస్టులు ఆడి 537వికెట్లు తీసిన అశ్విన్ దాయాది దేశం పాకిస్థాన్‌తో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు.ఇండియా-పాక్ మధ్య 2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.అయితే అశ్విన్ 2011లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. టీ20లు, వన్డేల్లో పాకిస్థాన్ తో తటస్థ వేదికల్లో భారత్ తలపడింది.ఆ సమయంలో అశ్విన్ పాకిస్థాన్‌తో ఆడటం జరిగింది. రెండేళ్ల కిందట టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌పై అశ్విన్ కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పటికీ అభిమానుల్లో అలాగే గుర్తుండిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+