ఆడ్ని అలా వదిలేయకండ్రా- ఇలా ఇరగ్గుమ్మండి: పాక్ మిస్టరీ బౌలర్ పై మాజీ లెజెండ్

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ ఏ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. పసికూన నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. మొత్తం నాలుగు పాయింట్లను సాధించి.. ఈ గ్రూప్ లో అగ్రస్థానానికి చేరింది. పాకిస్తాన్ కూడా నాలుగు పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ ఆధారంగా టాప్ పొజీషన్ కు వెళ్లింది భారత్. గెలవడమైతే గెలిచారు గానీ ఆడిన తీరు మాత్రం సగటు అభిమానికి ఆందోళనలోకి నెట్టింది. పైగా పాకిస్తాన్ తో మ్యాచ్ ఉన్నప్పుడు ఇలా ఆడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

ఈ పరిణామాలపై టీమిండియా మాజీ లెజెండరీ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తెరమీదికి వచ్చారు. పాకిస్తాన్ బౌలింగ్.. ప్రత్యేకించి మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మాట్లాడారు. టీమిండియాకు సలహాలు ఇచ్చారు. తారిఖ్ ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున అత్యంత ప్రమాదకరమైన స్పిన్ ఆయుధంగా పరిగణిస్తోన్న నేపథ్యంలో అశ్విన్ ఈ సలహాలు ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Ravichandran Ashwin Tactic to counter Pakistan Mystery Spinner Usman Tariq in IND vs PAK Showdown

తన యూట్యూబ్ షో 'యాష్ కీ బాత్'లో మాట్లాడారు అశ్విన్. ఓ మేజికల్ వ్యూహం గురించి వివరించారు. క్రీజ్‌లో బంతి వేయడానికి ముందు తారిఖ్ ఇచ్చే విరామంపై భారత బ్యాటర్లు దీన్ని ప్రయోగించాలని సూచించారు. తారిఖ్ బంతి వేయడానికి ముందు చిన్న పాటి బ్రేక్ తీసుకున్నప్పుడు క్రీజ్ లో ఉన్న బ్యాటర్‌ దూరంగా జరిగిపోవడానికి హక్కు ఉంటుందని అశ్విన్ పేర్కొన్నారు. బంతి ఎప్పుడు వస్తుందో తనకు తెలియదు, అందుకే పక్కకు జరిగానని చెప్పొచ్చని, ఇది చట్టబద్ధమేనని అన్నారు.

ఇలా ఒకట్రెండుసార్లు చేస్తే ఉస్మాన్ తారిఖ్ ఏకాగ్రత, రిథమ్ తప్పుతాయని పేర్కొన్నారు. దీనికి ఏ బ్యాటర్ ధైర్యం చేస్తాడనేది చూడాలనుకుంటున్నానని అశ్విన్ చెప్పారు. ఈ విషయం అటు అంపైర్‌కు కూడా తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అంపైర్ బౌలర్‌ను హెచ్చరించాలా లేదా బ్యాటర్‌ నా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుందని, క్రికెట్ చరిత్రను బట్టి చూస్తే, మొదట బౌలర్‌నే హెచ్చరిస్తారని తెలిపారు.

ఇలా బ్యాటర్ పక్కకు జరిగితే అది తారిఖ్ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని, అతనిపై ఒత్తిడి పెరుగుతుందని, తన రిథమ్ ను మార్చుకునేలా చేస్తుందని అంచనావేశారు. ఒకవేళ తానే క్రీజ్ లో అతని బౌలింగ్ ను ఎదుర్కొనాల్సి వస్తే ఖచ్చితంగా ఇదే పని చేస్తాననీ తేల్చి చెప్పారు. ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది. అతని రన్ అప్ సాధారణంగా ఉన్నప్పటికీ, బంతిని విసిరే ముందు రెండు సెకన్ల పాటు అకస్మాత్తుగా ఆగిపోతాడు. ఆ తర్వాత అతను సైడ్ ఆర్మ్ తరహా స్లింగింగ్ స్టైల్‌లో ఆఫ్ బ్రేక్ బాల్ వేస్తాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+