Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై సూపర్ కింగ్స్ కు పొంచివున్న పెద్ద గండం: ఆర్సీబీ హీరో కమ్ బ్యాక్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు శుభవార్త అందింది. జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఆరోగ్యం మెరుగుపడింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగే కీలక మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. జోష్ రాక ఆర్సీబీ క్యాంప్ లో జోష్ నింపింది. సాయంత్రం 7: 30 గంటలకు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం హేజిల్ వుడ్ నెట్స్ లో శ్రమిస్తోన్నాడు.

నిజానికి హేజిల్‌వుడ్ గత వారం 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో కలిశాడు. కాలి కండరాలు పట్టేయడం, ఇతరత్రా గాయాల వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేడు. సీజన్ ఓపెనర్‌ను మిస్ అయినప్పటికీ, అతను చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. అతని రాకతో జట్టు బౌలింగ్ డిపార్ట్ మెంట్ మరింత బలపడుతుంది.

RCB Bowler Josh Hazlewood Finally Return Against Chennai Super Kings for Bengaluru match April 5

2025 సీజన్‌లో హేజిల్‌వుడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆ సీజన్‌లో అతను 22 వికెట్లు తీసి, జట్టు తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్ కోసం అతనిని రూ. 12.50 కోట్లకు రిటైన్ చేసుకుంది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. గాయాల కారణంగా తొలి మూడు మ్యాచ్ లకు అందుబాటులో ఉండట్లేదని తొలుత భావించినా, అతను అద్భుతంగా రికవరీ అవుతున్నాడు. రేపటి మ్యాచ్ లో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు.

దీనిపై రివ్‌స్పోర్ట్జ్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. జోష్ హేజిల్‌వుడ్ పునరాగమనం అత్యంత చేరువలో ఉందని తెలిపింది. ముందుగా అనుకున్నదానికంటే కూడా అతను చాలా ఫాస్ట్ గా రికవరీ అవుతున్నాడని, దాదాపు గంట సేపు నెట్స్‌లో నిలకడగా, విరామం లేకుండా బౌలింగ్ చేశాడని తెలిపింది. చక్కటి రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ తో బంతులను సంధించాడు. మొదట కొన్ని ఫుల్లర్లు, ఆ తర్వాత గుడ్ లెంగ్త్‌ బంతులను విసిరాడు. తన ట్రేడ్‌మార్క్ హార్డ్ లెంగ్త్‌తో పాటు పదునైన షార్ట్ బాల్స్‌ వేశాడు.

అతను పూర్తిగా కోలుకున్నట్టేనని, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో ఆడేందుకు అవకాశం ఉందని పేర్కొంది.క్రికెట్ ఆస్ట్రేలియా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని సీఎస్కేపై ఆడించి తొందరపడకూడదని భావిస్తే, ఏప్రిల్ 10న రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగే తదుపరి మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ ఆడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ గువహటిలోని బర్సపారా స్టేడియంలో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్లకు ఇది శుభసూచకం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+