ఆర్సీబీ చివరి తాపత్రయం

RCB vs LSG: ఐపీఎల్ 2025 లీగ్స్ దశ ముగుస్తున్న కొద్దీ.. ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ప్లేఆఫ్స్ లో పోటీ పడే జట్లేమిటనేది ఇప్పటికే ఖరారైనప్పటికీ- క్వాలిఫయర్స్ లో ఎవరిది ఏ స్థానం అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతూ వస్తోంది. ప్లేఆఫ్స్ ను మరింత రంజుగా మార్చింది.

ప్లేఆఫ్స్ లో అత్యంత కీలకం- క్వాలిఫయర్ 1. దీనికి అర్హత సాధించిన జట్టు ఫైనల్స్ చేరడానికి రెండు మ్యాచ్ లను ఆడే అవకాశం ఉండటమే దీనికి కారణం. ఇందులో అడుగు పెట్టడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చివరి ఛాన్స్ ఇంకా మిగిలేవుంది. నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో ఢీ కొట్టబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు లక్నోలోని ఏకనా స్టేడియం దీనికి వేదిక.

RCB to clash with LSG to reach Qualifier 1

ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికీ ఇదే చివరి లీగ్ మ్యాచ్ కూడా. ఇందులో గెలిస్తే.. క్వాలిఫయర్ 1లోకి అడుగు పెట్టగలుగుతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగలుగుతుంది.. 19 పాయింట్లతో. లేదూ అంటే పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 1 ఛాన్స్ ను కొట్టేస్తుంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోందీ ఆ జట్టే. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్ లల్లో తొమ్మిది విజయాలతో నంబర్ వన్ గా ఉందా జట్టు. నాలుగింట్లో మాత్రమే ఓడింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. మొత్తం 19 పాయింట్లు.. పంజాబ్ కింగ్స్ ఖాతాలో ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అకౌంట్ లో 17 పాయింట్లు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్ప్ పై గెలిస్తే 19 పాయింట్లను సాధించగలుగుతుంది. దీనికి మెరుగైన నెట్ రన్ రేట్ కూడా జత కలిస్తే క్వాలిఫయర్ 1కు రెడ్ కార్పెట్ పరిచినట్టే అవుతుంది. ప్రతి ఆర్సీబీ అభిమాని కూడా ఇదే కోరుకుంటోన్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఇప్పటివరకు 13 మ్యాచ్ లను ఆడిన ఆ జట్టు ఆరింట్లో గెలిచింది. ఏడు మ్యాచ్ లల్లో పరాజయాన్ని చవి చూసింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడోస్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకోవడం వల్ల ఈ మ్యాచ్ గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు.. ఆర్సీబీ క్వాలిఫయర్ అవకాశాలను దెబ్బతీయడం మినహా.

హేజిల్ వుడ్ జట్టుకు అందుబాటులోకి రావడం అతిపెద్ద ప్లస్ పాయింట్. నేటి మ్యాచ్ ఆడబోయే తుదిజట్టులో అతని చోటు దక్కడం దాదాపుగా ఖాయమైనట్టే. ప్లేయింగ్ 11లో- ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, బ్లెస్సింగ్ ముజారబానీ, సుయాష్ శర్మ ఆడొచ్చు. ఇంపాక్ట్ సబ్ గా రజత్ పటిదార్ ఉంటాడు.

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11లో మిఛెల్ మార్ష్, ఆర్యన్ జుయల్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కేప్టెన్, వికెట్ కీపర్) ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఓరూర్కే ఆడే అవకాశం ఉంది. ఇంపాక్ట్ సబ్: ఆకాష్ సింగ్ ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+