300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభం కాబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను ఢీకొట్టనుంది. రజత్ పటిదార్ సారథ్యంలో తొలి టైటిల్ గెలవడంతో ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌తో వారికి శుభారంభం పట్ల నమ్మకం ఉంది.
ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ భిన్నమైన సవాల్‌ను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్ దూకుడుగా ఉన్నా, పాట్ కమిన్స్ లేకపోవడం బౌలింగ్‌ను బలహీనపడింది. జోష్ హేజిల్‌వుడ్ వంటి కీలక బౌలర్లు లేని ఆర్సీబీని ఎదుర్కోవడానికి ఇషాన్ కిషన్ ఎలాంటి వ్యూహాలు పన్నుతాడనే విషయంపైనే గెలుపు ఆధారపడివుంది.

రజత్ పటిదార్ గత ఐపీఎల్ లో ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. తొలి సీజన్‌లోనే ఆర్సీబీని విజేతగా నిలిపాడు. 16 మ్యాచ్‌లలో 11 విజయాలు, 5 ఓటములు అతని ఖాతాలో ఉన్నాయి. గెలుపు శాతం 68.75. కెప్టెన్ గా ఇషాన్ కిషన్ కు లో ఇదే తొలి సీజన్. అతనికి నాయకత్వం కొత్తేమీ కాదు. గత ఏడాది తాను సారథ్యాన్ని వహించిన జార్ఖండ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించిన అనుభవం అతనికి ఉంది.
ఈ నేపథ్యంలో మాజీ భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఐపీఎల్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటడం ఖాయమని అన్నారు. తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడారు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లున్న రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ జట్లు గతంలో 250కి పైగా పరుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్, విధ్వంసకర బ్యాటింగ్ లైనప్, బలహీనమైన బౌలింగ్ యూనిట్లు దీనికి కారణమౌతాయని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ లో మిషన్ 300 నిజంగా సాకారమవుతుందని, కొన్ని జట్ల బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లను చూశానని, అవి ఆశించిన స్థాయిలో లేవని, పిచ్‌లు సహకరిస్తే ఆయా జట్ల మీద ప్రత్యర్థులు 300 పరుగులు స్కోరు అయ్యే అవకాశాలు ఉన్నాయని అశ్విన్ స్పష్టం చేశారు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 12 సార్లు 250కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ రెండుసార్లు 250కి పైగా పరుగులు చేసింది. హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)పై ఇషాన్ కిషన్ సెంచరీతో 286/6, ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిక్ క్లాసెన్ 39 బంతుల్లో 105 (నాటౌట్) పరుగులతో 278/3 స్కోరు చేసింది. ఇప్పుడు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అదే స్థాయిలో ఆడుతుందని అశ్విన్ అంచనా వేశారు.
-
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
IPL 2026 Second Phase Schedule: ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్-50 మ్యాచ్ ల తేదీలివే..! -
ఈసారి IPL 2026 Opening Ceremony లేదా ? ఏం జరుగుతోంది ? -
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications