రోహిత్ - విరాట్ మళ్లీ బరిలో దిగేది అప్పుడే..ఇదీ షెడ్యూల్, అక్కడే ట్విస్ట్..!!
క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ న్యూస్. రో-కో ద్వయం తిరిగి బ్యాటింగ్ విన్యాసాలకు ముహూర్తం ఖరారైంది. ఆసీస్ పర్యటనలో భాగంగా మూడో వన్డేలో రోహిత్- విరాట్ ఫుల్ మీల్స్ అందించారు. ఫ్యాన్స్ ఎంతో కాలంగా చూస్తున్న తమదైన ఆట తీరుతో పండుగ చేసారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ముగిసింది. దీంతో.. ఈ ఇద్దరు తిరిగి గ్రౌండ్ లో ఎప్పుడు కనిపిస్తారనే అభిమానుల ఎదురు చూపులకు సమాధానం వచ్చింది. రో-కో ద్వయం తిరిగి గ్రౌండ్ లోకి దిగే ముహూర్తం ఖరారైంది.
ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నెల 29నుంచి నవంబర్ 8 వరకు జరిగే టీ-20 సిరీస్ లో అయిదు మ్యాచ్ లు ఆడనుంది. వన్డే సిరీస్ పూర్తి కావటంతో చివరి మ్యాచ్ లో ఫ్యాన్స్ కు మరిచిపోలేని అనుభూతి మిగిల్చిన రోహిత్ - విరాట్ స్వదేశానికి పయనం అయ్యారు. ఈ ఇద్దరు తిరిగి ఎప్పుడు మరోసారి గ్రౌండ్ లో తమ బ్యాటింగ్ విన్యాసాలతో మురిపిస్తారనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. వచ్చే నెలలో సౌతాఫ్రికా, భారత్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో సఫారీ జట్టు టీమ్ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. ముందుగా టెస్టు సరీస్ ఉండనుంది. ఇది నవంబర్ 14- నవంబర్ 26 మధ్య ఉంది.

టెస్టు సిరీస్ పూర్తయిన తరువాత నవంబర్ 30 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. సౌతాఫ్రికా తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం మళ్లీ రోహిత్- విరాట్ జోడీ బరిలోకి దిగడం పక్కా గా కనిపిస్తోంది. అంటే ఈ ఇద్దరి కోసం ఫ్యాన్స్ దాదాపు నెల రోజులు వేచి చూస్తే చాలన్న మాట. సౌతాఫ్రికాతో తొలి వన్డే నవంబర్ 30 రాంచి లో జరగనుంది. రెండో వన్డే డిసెంబర్ 03 రాయపూర్ లో, మూడో వన్డే డిసెంబర్ 06 విశాఖపట్టణం లో నిర్వహించేలా షెడ్యూల్ ఫిక్స్ చేసారు. ఇక.. ఏడు నెలల విరామం తరువాత ఆసీస్ టూర్ లో రీ ఎంట్రీ ఇచ్చిన రో-కో చివరి మ్యాచ్ లో తమ బ్యాట్ తోనే అన్ని విమర్శలకు సమాధానం ఇచ్చారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన విరాట్.. మూడో మ్యాచ్ లో అభిమానులకు మరిచిపోలేని ఆనందాన్ని పంచారు. అటు రోహిత్ సెంచరీతో కొత్త రికార్డులు నెలకొల్పారు.

ఛేదనలో బెస్ట్ జోడీగా పేరుతెచ్చుకున్న రో-కో మరోసారి ఆసీస్ పై రెచ్చిపోయారు.రిటైర్ అవుతా రనే ప్రచారానికి ఇద్దరూ ఈ మ్యాచ్ ద్వారా తమ సత్తా ఏంటో స్పష్టం చేసారు. మరో రెండేళ్లు ఈ ఇద్దరు క్రికెట్ లో కొనసాగుతారనే అంచనాలకు బలం చేకూర్చారు. కాగా.. సౌతాఫ్రికా టూర్ లో అనివార్య పరిస్థితులు ఏర్పడితే మినహా ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సమయం కోసం వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications