రోహిత్-కొహ్లీకి ఎసరుపెడుతున్న ఆ ఇద్దరు? 2026లో అసలైన ముప్పు..!

భారత క్రికెట్ లో దశాబ్దకాలంగా తమ అత్యుత్తమ ఆటతీరుతో దిగ్గజాలుగా ఎదిగిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కొహ్లీ. కొన్నేళ్లుగా వీళ్లు లేకుండా టీమ్ ఇండియా మ్యాచ్ లు ఎలా ఉంటాయో కూడా ఊహించలేని పరిస్ధితి. అంతగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ఈ జోడీకి గతేడాది మాత్రం కష్టకాలం ఎదురైంది. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పేసి వన్డేల్లో కొనసాగాలని భావించిన వీరిద్దరికీ వరుస షాక్ లు ఎదురయ్యాయి. ఓ దశలో దేశవాళీ క్రికెట్ ఆడితేనే జట్టులో స్ధానం ఉంటుందని బీసీసీఐ తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో ఓవైపు దేశవాళీ టోర్నీలు ఆడుతూనే మరోవైపు వన్డేల్లో రాణించి విమర్శలకు చెక్ పెట్టారు.

అయితే గతేడాది ఓ ఎత్తు. ఇప్పుడు రాబోయే సంవత్సరం మరో ఎత్తు. 2026లో టీమిండియా కీలక టోర్నీలు ఆడాల్సి ఉంది. మరోవైపు యువ క్రికెటర్లు తమ అసాధారణ ఆటతీరుతో జాతీయ జట్టులో స్ధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ తమ పాత ఫామ్ కొనసాగించి వన్డే టీమ్ లో స్ధానం కోసం ఎప్పటికప్పుడు పోటీ పడాల్సిందే. లేకపోతే ఏ క్షణమైనా వేటు తప్పదన్న సంకేతాల్ని బీసీసీఐ నేరుగానే ఇచ్చేస్తోంది.

Rohit-Kohli Under Pressure from Two New Team India Stars

ఇలాంటి సమయంలో అసలు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ స్ధానాలకు ఎసరు పెట్టబోతున్న కీలక ఆటగాళ్లను చూస్తే చాలా మందే కనిపిస్తున్నారు. అయితే వీరిలో ఓ ఇద్దరు మాత్రం కచ్చితంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ స్ధానాల్ని భర్తీ చేసే దిశగా దూసుకొస్తున్నారు. ఇందులో ఇప్పటికే వన్డే జట్టులో ఆడుతున్న యశస్వీ జైశ్వాల్ అయితే మరొకరు తాజాగా చోటు సంపాదించిన దేవదత్ పడిక్కల్. వీరిద్దరూ ఇప్పటికే తమ అసాధారణ ఆటతీరుతో సెలెక్టర్లను ఆకట్టుకుంటున్నారు.

Rohit-Kohli Under Pressure from Two New Team India Stars

అంతర్జాతీయ క్రికెట్‌లో, కెరీర్‌లు తరచుగా ఒకే ఇన్నింగ్స్‌తో రూపుదిద్దుకుంటాయి లేదా ముగుస్తాయనే నానుడి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ తన అద్భుతమైన పరుగులతో ఇప్పటికే సెలెక్టర్ల తలుపు తడుతున్నాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ వన్డేల్లో కూడా తాను ఓపెనర్‌గా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో రోహిత్,కోహ్లీ నిలకడను కోల్పోతే మాత్రం కచ్చితంగా జట్టులో స్ధానం ప్రశ్నార్ధకం కావడానికి ఎంతో సమయం పట్టదన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+