మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ భార్య - పేరు పెట్టిన నెటిజన్స్
Rohit Sharma and Ritika Sajdeh: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య రితిక సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇది వారికి రెండో సంతానం. ఇప్పటికే రోహిత్ శర్మ- రితిక దంపతులకు ఓ కుమార్తె ఉంది. పేతాజాగా వారి ఫ్యామిలీలో నాలుగో మెంబర్ వచ్చి చేరాడు.
శుక్రవారం సాయంత్రం ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో రితిక ప్రసవించారు. 2018లో రితిక తొలి సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారి పేరు సమైరా. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

డెలివరి ఉండటం వల్లే రోహిత్ శర్మ.. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరం అయ్యాడనే విషయం తెలిసిందే. ఈ నెల 22వ తేదీన పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలుకాబోతోంది. ఈ గేమ్ ఆరంభానికి వారం రోజుల ముందే రితిక ప్రసవించిన నేపథ్యంలో ఇక రోహిత్ శర్మ.. తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోతే ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించాలని ఇదివరకే నిర్ణయించుకుంది బీసీసీఐ. కేఎల్ రాహుల్‌తో ఇన్నింగ్ ఆరంభించేలా ప్లాన్ వేసుకుంది. ప్రస్తుతం అతను మినహా మిగిలిన జట్టు మొత్తం కూడా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది కూడా. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోంది.
భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు పెర్త్ టెస్ట్ మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్‌బోర్న్‌లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక.
రితిక సజ్దే ప్రసవం నేపథ్యంలో నెటిజన్లు అత్యుత్సాహం చూపుతున్నారు. జూనియర్ రోహిత్ శర్మకు ఇండియా అండర్ 19 టీమ్‌లో చోటు దక్కినట్టేనంటూ కామెంట్స్ పెడుతున్నారు. అకాయ్, అంగద్, అగస్త్య.. అనే పేర్లు పెట్టాలంటూ సూచిస్తోన్నారు.












Click it and Unblock the Notifications