Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాహ్.. వాహ్ అన్నలూ వాహ్: కూడబలుక్కుని భలే అవుట్ అయ్యారు

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభమైంది. పెర్త్‌ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. వన్డే కేప్టెన్ గా అపాయింట్ అయిన తర్వాత శుభ్‌మన్ గిల్ కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో ఎంట్రీ ఇచ్చారు. టెస్ట్, టీ20ల నుంచి ఇదివరకే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరూ వన్డే ఫార్మాట్ లో కొనసాగుతున్నారు.

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ఆడుతున్నారు. రోహిత్ శర్మకు ఇది 500 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా. ఇప్పటివరకు అతను 274 వన్డేలు ఆడాడు. 67 టెస్టులు, 159 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అందరి చూపూ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ, టాప్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మీదే నిలిచింది. 2027 ఐసీసీ వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్ లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కేప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే.

Rohit Sharma and Virat Kohli disappointed in 1st ODI against Austrailia

ఈ పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. 14 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసి జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇందులో ఒకే ఒక్క ఫోర్ నమోదైంది. ఆఫ్ స్టంప్స్ కు కాస్త దూరంలో హేజిల్ వుడ్ సంధించిన నాలుగో ఓవర్ నాలుగో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు రోహిత్. అనూహ్యంగా బౌన్స్ అయిన ఆ డెలివరీని కట్ షాట్ కొట్టబోయి.. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతి కాస్తా.. సెకెండ్ స్లిప్ లో ఉన్న రెన్ షా చేతుల్లో వాలింది. దీంతో 4.4 ఓవర్లల్లో 13 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది.

స్కోర్ బోర్డ్ పై మరో ఎనిమిది పరుగులు జత అయ్యాక.. విరాట్ కోహ్లీ కూడా అదే బాట పట్టాడు. ఏకంగా డకౌట్ అయ్యాడు కోహ్లీ. ఏడు బంతులను ఎదుర్కొన్న ఈ రన్ మెషీన్.. తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. మిఛెల్ స్టార్క్ వేసిన ఓవర్ అది. ఫుల్ ఆఫ్ సైడ్ గా వేసిన ఆ డెలివరీని కోహ్లీ డ్రైవ్ చేయబోయాడు. థిక్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతిని కూపర్ కొన్నోల్లి అద్భుతంగా డైవ్ కొట్టి అందుకున్నాడు. దీంతో 21 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం కేప్టెన్ శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ క్రీజ్ లో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+