Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ కు మరో జట్టు..! అక్కడా గిల్ కు షాక్..!

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు ప్రస్తుతం అన్ని జట్లూ సిద్ధమవుతున్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో పలువురు యువ క్రికెటర్లకు స్ధానం దక్కింది. అయితే యువ క్రికెటర్, వన్డే జట్టు కెప్టెన్ కూడా అయిన శుభ్ మన్ గిల్ కు మాత్రం చోటు దక్కలేదు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. గిల్ తాజా ఫామ్, ఇతర కారణాల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ తర్వాత బీసీసీఐ వివరణలు ఇచ్చుకుంది.

అయితే ఇప్పటికీ శుభ్ మన్ గిల్ వంటి ఆటగాడిని టీ20 వరల్డ్ కప్ కు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు ప్రత్యామ్నాయంగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన జట్టును ప్రకటించాడు. ఇందులో ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో రాణిస్తున్న పలువురు యువ క్రికెటర్లకు స్ధానం కల్పించాడు. కానీ శుభ్ మన్ గిల్ ను మాత్రం పట్టించుకోలేదు. దీంతో శుభ్ మన్ గిల్ అంత పనికిరాని వాడు అయిపోయాడా అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Same Story Alternate T20 World Cup Squad Chosen by Ex-Star Gill Misses The Cut

టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆకాశ్ చోప్రా ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ టీం ఇండియాను ఓసారి పరిశీలిస్తే.. ఇందులో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, జితేష్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ కు చోటు దక్కింది. అయితే శుభ్ మన్ గిల్ కు మాత్రం ఇందులో స్ధానం లేకుండా పోయింది.

ఈసారి టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు ముందు గిల్ ఫామ్ ఆధారంగా అతన్ని పట్టించుకోలేదు. ఈ సంవత్సరం ఆసియా కప్ కు ముందు భారత టీ20 జట్టులోకి వైస్ కెప్టెన్ గా గిల్ ను ఎంపిక చేసిన తర్వాత ఈ కష్టాలు మొదలయ్యాయి. గిల్ 15 ఇన్నింగ్స్ లు ఆడి 24.25 సగటుతో 291 పరుగులు మాత్రమే చేశాడు. 137 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 201 పరుగులు చేశాడు. దీంతో అతని పేలవమైన ఫామ్ కారణంగా సెలెక్టర్లు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ టీమ్ ఎంపికలో పట్టించుకోలేదు.

Same Story Alternate T20 World Cup Squad Chosen by Ex-Star Gill Misses The Cut

ఈ సంవత్సరం గిల్ భారత టీ20 జట్టులోకి వచ్చినప్పుడు గిల్ బాగానే ఆడాడు. అలాగే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దానితో సెలెక్టర్లు గిల్ ను టీ20 జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా చూస్తే ఏడాది కంటే ఎక్కువ కాలం తర్వాత టీ20 ఫార్మాట్ లోకి తిరిగి వచ్చాడు. అలాగే సంజూ శ్యాంసన్ స్థానంలో ఓపెనింగ్ స్లాట్ లో చేరాడు. ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్న శాంసన్ ను తప్పించడంపై బీసీసీఐ విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత గిల్ కూడా ఫెయిల్ అవుతుండటంతో బీసీసీఐ వరల్డ్ కప్ కు పక్కనబెట్టేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+