Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CSK బ్యాటర్ పిచ్చ కొట్టుడు: 14 సిక్సర్లు, 9 ఫోర్లు- రోహిత్ శర్మ రికార్డులు తుక్కు తుక్కు

విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ తడాఖా చూపాడు. గోవాపై జరుగుతున్న మ్యాచ్ లో మెరుపు వేగంతో సెంచరీ పూర్తి చేశాడు. 56 బంతుల్లో శతకం బాదాడు. సునామీ ఇన్నింగ్ తో సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను 9 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగాడు. అతని సోదరుడు ముషీర్ ఖాన్ కూడా గోవాపై 66 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి అయిదో వికెట్‌కు 60 బంతుల్లో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ కు దిగింది ముంబై. యశస్వి జైస్వాల్- 46, అంగ్ క్రిష్ రఘువంశీ- 11, ముషీర్ ఖాన్- 60, సిద్ధేశ్ లాడ్- 17, కేప్టెన్ శార్దుల్ ఠాకూర్- 27, హార్దిక్ టమోరె- 53, షామ్స్ ములానీ- 22, తనూష్ కోటియాన్- 23, తుషార్ దేశ్ పాండే- 7 పరుగులు చేశారు.మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగిన సర్ఫరాజ్ చెలరేగాడు. 75 బంతుల్లో 157 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 209.33. అతని బ్యాటింగ్ ధాటికి ముంబై నిర్ణీత 50 ఓవర్లల్లో ఏకంగా 444 పరుగులు చేసింది.

Sarfaraz Khan Fires 157 off 75 in Vijay Hazare Trophy

ఈ ఇన్నింగ్స్‌లో 120 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అంతకుముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సోదరులిద్దరూ కలిసి 107 పరుగులు సాధించారు. సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ, ఒక శతకం నమోదు చేశాడు. గోవాపై 56 బంతుల్లో శతకం సాధించి సర్ఫరాజ్ ఖాన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు.

విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున అత్యంత వేగవంతమైన లిస్ట్ ఏ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పుడు సర్ఫరాజ్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ ఈ నెల 24వ తేదీన సిక్కింపై 62 బంతుల్లో శతకం పూర్తి చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో ఈ రికార్డును చెరిపేశాడు సర్ఫరాజ్. 56 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+