World Cup 2023: ఫైనల్స్ లో రోహిత్ టీం ప్రత్యర్ధి ఎవరు - నో డౌట్, ఇదే జరిగేది..!!
ప్రపంచ కప్ సమరం కీలక దశకు చేరుకుంది. టైటిల్ విన్నర్ ను డిసైడ్ చేసే మ్యాచ్ మరింత ఉత్కంఠ పెంచుతోంది. టీమిండియా ఇప్పటికే ఫైనల్స్ కు చేరింది. ప్రత్యర్ధి కోసం రోహిత్ టీం వెయిట్ చేస్తోంది. కోల్ కతాలో రెండో సెమీస్ లో ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా జట్లు ఈ రోజు కోల్ కతాలో తల పడుతున్నాయి. రెండు టీంలు మంచి ఫాంలో ఉన్నాయి. అయితే, రికార్డులు మాత్రం సఫారీలను కంగారు పెడుతున్నాయి. ఈ రెండు టీంల్లో ఎవరు ఫైనల్స్ కు చేరుతానేది ఆసక్తి గా మారుతోంది.
నేడే రెండో సెమీస్:ప్రపంచ కప్ రెండో సెమీస్ నేడు జరగనుంది. సౌతాఫ్రికా అన్ని విభాగాల్లో బలంగా ఉన్నానాకౌట్ గండం ఇప్పటి వరకు వెంటాడుతోంది. మరో వైపు అయిదు సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆసీస్ తో తలపడుతోంది. నాలుగుసార్లు సెమీస్ చేరినా.. ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దక్షిణాఫ్రికా లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఏడు గెలిచిన బవుమా సేన ఏకంగా రెండో స్థానంలో సెమీస్ బెర్త్‌ను పట్టేసింది. ఓపెనర్ డికాక్ పరుగుల వరద పారిస్తుండగా.. డుస్సెన్, మార్‌క్రమ్, క్లాసెన్ చెలరేగి పోతున్నారు. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ బవుమా ఆడేది అనుమానమే. ఇక బౌలింగ్‌లో పేసర్లు రబాడ, ఎన్‌గిడి ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నారు. స్పిన్నర్ కేశవ్‌తోపాటు ఆల్‌రౌండర్ కొట్జీ మ్యాచ్ విన్నర్లుగా మారారు.

అక్కడ టీమిండియా సిద్దం:రెండు వరుస ఓటములతో ఆరంభించిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఏడు వరుస విజయాలతో టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. అయితే, లబుషేన్ మినహా మిగతా బ్యాటర్ల నిలకడలేమి జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఓపెనర్ వార్నర్ వైఫల్యం ఆరంభంలోనే దెబ్బతీస్తోంది. అయితే, మార్ష్ తిరిగి వచ్చిన తర్వాత భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఒంటరి పోరాటంతో పరువు నిలిపాడు. అయితే, కెప్టెన్ కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం ఆ లోటుపాట్లను తెలియకుండా చేస్తోంది. స్టార్క్‌తోపాటు హాజెల్‌వుడ్ రాణిస్తున్నారు. జంపా, మ్యాక్సీ స్పిన్ విభాగాన్ని నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ తో పాటుగా వాతావరణం సైతం కీలకంగా మారుతోంది.
ఫైనల్ పై భారీ అంచనాలు:ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతంది. ఈ రెండు జట్లను లీగ్ దశలో ఓడించిన టీమిండియా ఇప్పటికే ఫైనల్స్ చేరుకుంది. ఈ నెల 19న అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, వాతావరణ అనుకూలించక ఈ రోజు మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే నాడు నిర్వహిస్తారు. అప్పటికీ వర్షం వీడకుంటే రన్ రేట్ లో ఆధిక్యతలో ఉన్న సౌతాఫ్రికా ఫైనల్ చేరుతుంది. ఈ రెండు జట్లు ఎవరు ఫైనల్ చేరినా టీమిండియా ప్రస్తుతం ఉన్న ఫాంలో ఎదుర్కోవటం అంత సులువు కాదు. సొంత గడ్డ పైన అహ్మదాబాద్ లో లక్షలాది మంది అభిమానుల మద్దతు టీమిండియాకు కలిసొచ్చే అంశం. సెమీస్ లో కివీస్ తో టీమిండియా ఆట తీరు చూసిన తరువాత..ఫ్యాన్స్ అంతా నో డౌట్... మూడోసారి రోహిత్ టీందే ప్రపంచ కప్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications