సూపర్ 8లో భారత్ పై గట్టోళ్లే దిగుతున్నారు.. !!
టీ20 వరల్డ్ కప్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. గత వరల్డ్ కప్ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. నాటి ఫైనల్ రీమ్యాచ్‌గా పరిగణిస్తారు దీన్ని. ఈ సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో భారత్ కు సమవుజ్జీగా నిలిచింది దక్షిణాఫ్రికా. లీగ్స్ ఏ ఈ రెండు జట్లు కూడా ఏ ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోలేదు. తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చాయి.
ఏ జట్టు గెలుస్తుందో.. ఏది ఓడుతుందో అని అంచనాలు వేయలేనంత పటిష్టంగా ఉన్నాయివి. రెండు జట్లు కూడా ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. టీ20 క్రికెట్‌లో ప్రస్తుతానికి అత్యుత్తమ జట్లుగా నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ పోరాటం జరగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌లు, అత్యుత్తమ బౌలర్లు ఈ రెండు జట్లకు బలంగా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా తుది జట్టు అంచనా
ఓపెనర్లు: క్వింటన్ డి కాక్, ఎయిడెన్ మార్క్ రమ్
ఎడమచేతి వాటం వెటరన్ బ్యాటర్ క్వింటన్ డికాక్ జట్టులోకి తిరిగి రావడంతో ఆ జట్టుకు అదనపు బలం. భారత్‌పై అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. భారత ఉపఖండం పిచ్ లపైనా డికాక్ కు మంచి అవగాహన ఉంది. ఇక్కడి పిచ్ లపై అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం అతని సొంతం. ఇది ప్లస్ పాయింట్.
ఈ మ్యాచ్ లో కపడా అద్భుతంగా రాణిస్తాడని అంచనా వేస్తోంది టీమ్ మేనేజ్మెంట్. అదీగాక డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కేప్టెన్ ఎయిడెన్ మార్క రమ్‌తో కలిసి డికాక్ క్రీజ్ లో కుదురుకుంటే భారీ స్కోర్ తప్పకపోవచ్చు. వీరిద్దరిది కూడా విధ్వంసకర ద్వయం. ఒకవేళ మార్క్ రమ్ కుదురుగా ఆడినా గానీ స్ట్రైక్ ను రొటేట్ చేస్తూ డికాక్ మీద ఒత్తిడిని తగ్గించగలడు.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు
దక్షిణాఫ్రికా టాప్, మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. వికెట్ కీపర్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్ సెన్.. ఇలా లోయర్ ఆర్డర్ వరకూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే. ర్యాన్ రికెల్టన్ ఇటీవలి మ్యాచ్‌లలో బ్యాట్‌తో అద్భుతంగా రాణించాడు. డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ పించ్ హిట్టర్లే. జట్టుకు కీలకమైన భాగస్వామ్యాన్ని అందించగలరు. లోయర్ ఆర్డర్ లో మార్కో జన్ సెన్ అటు బంతితో ఇటు బ్యాట్ తో దూకుడుగా ఆడగలడు.
బౌలర్లు సత్తా చాటడం ఖాయం..
జార్జ్ లిండే జట్టులో రెండో స్పిన్నర్‌గా ఉండొచ్చు. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో ఇబ్బంది పడినందున లిండేను ఆ జట్టు సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. లిండే వద్దనుకుంటే కార్బిన్ బోష్ కు అవకాశం దక్కొచ్చు. కగిసో రబడకు అపారమైన అనుభవం ఉంది. పదునైన బంతులతో బ్యాటర్లను కట్టిపడేయగలడు. లుంగీ ఎన్గిడి కూడా తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాడు. గతంలో భారత్‌పై స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సమర్థవంతంగా రాణించాడు. అహ్మదాబాద్ పిచ్ ఈ స్పిన్నర్లకు ఎంతగా అనుకూలిస్తుందనేది చర్చనీయాంశం.
దక్షిణాఫ్రికా తుది జట్టులో..
క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్ రమ్ (కేప్టెన్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే/కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎన్గిడి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications