సింహంతో వేట- సన్‌రైజర్స్‌తో ఆట..రెండూ ప్రమాదకరమే: నేడు బలయ్యేది ఆ జట్టే?

Sunrisers Hyderabad Playing 11: ఐపీఎల్ మ్యాచ్‌లకు అర్థాన్నే మార్చివేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు తన రెండో గేమ్ ఆడబోతోంది. సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోందీ ఆరెంజ్ ఆర్మీ. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

గత ఏడాది తమను చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోటీకి సిద్ధపడింది లక్నో సూపర్ జెయింట్స్. గత సీజన్‌లో లక్నో నిర్దేశించిన 167 పరుగులను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కొట్టి అవతల పడేసింది సన్‌రైజర్స్. 62 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ 89, అభిషేక్ శర్మ 75 పరుగులతో కదం తొక్కారు. నాటౌట్‌గా నిలిచారు.

srh-playing-11-vs-lsg-2025-sunrisers-hyderabad-eyes-on-300

ఈ దఫా ఆ అవకాశం ఇవ్వకూడదని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తోంది. 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన కేప్టెన్ రిషబ్ పంత్ మేజిక్ పైనే ఆధారపడింది. ఇప్పటికే చేతికి అందిన మ్యాచ్ దూరమైన పరాభవంలో ఉన్నారు సూపర్ జెయింట్స్. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై తృటిలో పరాజయాన్ని చవి చూసింది. బలహీనమైన బౌలింగ్ డిపార్ట్‌మెంట్ దెబ్బకొట్టిందా మ్యాచ్‌లో.

సూపర్ జెయింట్స్ బౌలర్లల్లో రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్‌, అవేష్ ఖాన్‌కు మాత్రమే అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన అనుభవం ఉంది. ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ బౌలర్లు లేరా జట్టులో. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ పెద్దగా రాణించలేకపోయారు. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసినప్పటికీ రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. బిష్ణోయ్ ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తన దూకుడును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని అందించారు. అనంతరం ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. 47 బంతుల్లోనే అజేయంగా 106 పరుగులు చేశాడు.

హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత బలంగా కనిపిస్తోంది. టాప్ 6 బ్యాటర్లందరూ కూడా 200, అంతకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌‌ను కలిగివుండటం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఫలితంగా- ఈ గేమ్‌లో కూడా పరుగుల వరద పారుతుందనడంలో సందేహాలు ఉండకపోవచ్చు.

srh-playing-11-vs-lsg-2025-sunrisers-hyderabad-eyes-on-300

రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు కూడా భారీగా పరుగులు ఇచ్చుకోవడం కొంత ఆందోళనకరంగా మారిందా జట్టుకు. హర్షల్ పటేల్ మినహా మిగిలిన ఫాస్ట్ బౌలర్లందరూ ఓవర్‌కు 10కి పైగా పరుగులు ఇచ్చారు. కేప్టెన్ ప్యాట్ కమిన్స్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. నాలుగు ఓవర్లలో 60 పరుగులు పిండుకున్నారు ఆర్ఆర్ బ్యాటర్లు. బౌలింగ్ పదును మరింత మెరుగుపడాల్సి ఉంది.

సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు.. ఇన్నింగ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. వారిని ఎలా నిలువరించాలనే విషయంపైనే లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు ఆధారపడి ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లు కావడం వల్ల స్పిన్నర్లను బరిలో దించే అవకాశాలు లేకపోలేదు.

Take a Poll

సన్‌రైజర్స్ తుదిజట్టులో మార్పులేవీ ఉండకపోవచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కేప్టెన్), సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా ఆడే అవకాశాలు ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్‌ తుదిజట్టులో- ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కేప్టెన్- వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్ ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+