Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ మధ్యాహ్నమే- హోమ్ గ్రౌండ్ ఉప్పల్ లో: SRH కు వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డ్..

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్ ను ఎదుర్కొనబోతోంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరగనుందీ పోరు. గాయం కారణంగా పాట్ కమిన్స్ ఈ మ్యాచ్ కు కూడా దూరం అయ్యాడు. డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్ రైజర్స్.. సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. ఈ జట్టుపై వెరీ బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది సన్ రైజర్స్ కు.

ఈ రెండింటి మధ్య ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరగ్గా నాలుగుసార్లు సూపర్ జెయింట్స్ దే పైచేయి అయింది. సన్ రైజర్స్ రెండింట్లో మాత్రమే నెగ్గింది. టై లేదా ఫలితం లేని మ్యాచ్‌లు లేవు ఇప్పటిదాకా. సన్ రైజర్స్ కు ఇది మూడో మ్యాచ్. తొలి మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓటమి పాలైంది గానీ రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను 65 పరుగుల తేడాతో ఖంగు తినిపించింది వారి సొంత గడ్డపైనే.

SRH vs LSG Sunrisers Eye 300-Run Milestone as Ishan Kishan Sparks Attack in IPL with Lucknow

లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడింది ఒక్కటే. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తయింది. తన తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ప్రదర్శనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. గత ఏడాది కాలంగా అతను తన బ్యాటింగ్ విధానాన్ని పూర్తిగా మార్చుకుని స్ట్రైక్ రేట్‌ను గణనీయంగా పెంచుకున్నాడు. కిషన్ భారీ ఇన్నింగ్స్ ఆడినట్లయితే 300 పరుగుల మార్కును అధిగమించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించగలదు.

'ఆరెంజ్ ఆర్మీ'లో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరందరూ ధాటిగా పరుగులను రాబట్టుకోగలరు. సమష్టిగా ఆడితే 300 పరుగుల మార్కును ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదీ జట్టుకు. పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ బలహీనంగానే కనిపిస్తోంది. ఎయిడెన్ మార్క్ రమ్, మిచెల్ మార్ష్‌, రిషబ్ పంత్‌, నికొలస్ పూరన్ వంటి బ్యాటర్ల దూకుడును అడ్డుకోవడంపైనే సన్ రైజర్స్ విజయం ఆధారపడి ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ లో- ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కేప్టెన్) హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ ఆడొచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్ గా డేవిడ్ పేన్/బ్రైడన్ కార్స్ దిగొచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టులో- మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్ రమ్ రిషబ్ పంత్ (కేప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి/షాబాజ్ అహ్మద్, ఎన్రిచ్ నోర్ట్జే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ ఆడే అవకాశం ఉంది.

ఇంపాక్ట్ ప్లేయర్: దిగ్విజేష్ రాథీ బరిలో దిగొచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+