రాడనుకున్న స్టీవ్ స్మిత్ వచ్చేశాడు..!!
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా నేడు తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంకను ఢీ కొట్టనుంది. ఈ సాయంత్రం 7 మ్యాచ్ మొదలవుతుంది. పల్లెకెల్ స్టేడియం దీనికి వేదిక. ఈ గేమ్ ఆస్ట్రేలియన్లకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇదివరకు జింబాబ్వే చేతిలో చిత్తయిన నేపథ్యంలో ఇందులో గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తుది జట్టులో కొన్ని ప్రధాన మార్పులు చోటు చేసుకోవచ్చు.
ఈ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్ అందింది. గాయపడ్డ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో స్టీవెన్ స్మిత్ జట్టుతో జాయిన్ కానున్నాడు. ఈ సాయంత్రం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు అవసరమైతే అతను అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌కు ముందు హేజిల్ వుడ్ గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతనికి జట్టులో చోటు దక్కలేదు. అదే సమయంలో మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడ్డాడు. గజ్జల్లో దెబ్బ తగలడంతో టెస్టిక్యులర్ బ్లీడింగ్ గురయ్యాడు. దీంతో అప్పటికప్పుడు స్మిత్ ను శ్రీలంకకు పంపింది క్రికెట్ ఆస్ట్రేలియా.

శ్రీలంకతో జరిగే మ్యాచ్‌కు ముందు స్మిత్ నెట్ ప్రాక్టీస్ పాల్గొన్నాడు. ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా? లేదా అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మార్ష్ కోలుకుంటోన్నాడు. నెట్ సెషన్స్‌లో పాల్గొంటోన్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో చేతికి దెబ్బ తగిలిన మార్కస్ స్టోయినిస్ కూడా నెట్స్ లో కనిపించాడు. అతని గాయం తీవ్రమైనది కాకపోవడం వల్ల శ్రీలంక మ్యాచ్ లో అందుబాటులో ఉండొచ్చు.
జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా అనూహ్యంగా ఓటమిపాలైంది. సూపర్ 8కు చేరే ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే శ్రీలంకపై గెలిచి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోందా జట్టు. స్టీవ్ స్మిత్ అందుబాటులో ఉండటం, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినిస్ ల విషయంలో అనిశ్చితి నెలకొనడం వల్ల అవసరమైతే అతను మ్యాచ్‌కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ డోడెమైడ్ వివరించారు.
స్మిత్ చివరిగా 2024 ఫిబ్రవరిలో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ఈ ఫార్మట్ లో ఆడే అవకాశం అతనికి దక్కలేదు. ఇటీవలి బిగ్ బాష్ లీగ్ లో అతను అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. అక్కడ 59.80 సగటు, 167.97 స్ట్రైక్ రేట్‌తో 299 పరుగులు చేశాడు. దీంతో అతన్ని ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా తరఫున చివరిసారి ఆడిన తర్వాత, వివిధ లీగ్‌లు, ఫ్రాంచైజీలలో స్మిత్ సగటు గణనీయంగా పెరిగింది. 49.73 సగటుతో, 156.19 స్ట్రైక్ రేట్‌తో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.












Click it and Unblock the Notifications