Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దుర్భరంగా టీమిండియా మాజీ స్టార్‌: ప్రతినెలా ఆర్థికసాయం- జీవితాంతం: గవాస్కర్ పెద్ద మనసు

Vinod Kambli: వినోద్ కాంబ్లి.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన ప్లేయర్. లెజెండరీ బ్యాటర్. సచిన్ టెండుల్కర్ టీమ్ మేట్. స్కూల్ క్రికెట్‌లో సచిన్‌తో కలిసి 664 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పారు. తొమ్మిది సంవత్సరాల పాటు నిలకడగా సత్తా చాటిన లెఫ్ట్ హ్యాండర్.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించిన ఈ ఆల్‌రౌండర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తరువాత దాదాపుగా తెరమరుగు అయ్యారు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్నా ఆయన సర్వీసులను ఏ రకంగానైనా వినియోగించుకోవడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

Sunil Gavaskar Foundation will give Vinod Kambli Rs 30000 per month for the rest of his life

వినోద్ కాంబ్లి సమకాలీకులు ఏదో ఒకరకంగా లైమ్ లైట్‌లో ఉంటోన్నారు గానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి అంతంతమాత్రమే. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఒక దశలో నడవలేని స్థితిలో ఉన్నారాయన. పక్కన ఇద్దరు మనుషులు ఉంటే గానీ అడుగు తీసి అడుగువేయలేని దుస్థితిని ఎదుర్కొన్నారు.

గతంలో ఓ వీడియో క్లిప్.. ఆయన అనారోగ్య పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఓ బైక్ సపోర్ట్‌గా నిల్చోవడం, ఆ తరువాత కిందపడబోతోండగా.. ఇద్దరు వ్యక్తులు చేతులతో పట్టుకుని నిల్చోబెట్టటం, భుజాలపై మోసుకుంటూ రావడం అప్పట్లో ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఆయన వయస్సు కూడా పెద్దగా లేదు. 53 సంవత్సరాలే.

2013లో వినోద్ కాంబ్లి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. టెస్ట్, వన్డేల్లో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు కాంబ్లి. షేన్ వార్న్ బౌలింగ్‌ను ఉతికి ఆరేసిన మొట్టమొదటి ప్లేయర్. వార్న్ బౌలింగ్‌లో 22 పరుగులు పిండుకన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 17 టెస్టుల్లో 1,084, 104 వన్డేల్లో 2,477 పరుగులు చేశాడు.

ఈ దుస్థితిలో ఉన్న వినోద్ కాంబ్లిని ఆదుకోవడానికి ముందుకొచ్చారు లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్. ప్రతినెలా 30,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ తరఫున జీవితాంతం వరకూ కాంబ్లికి ప్రతినెలా ఈ ఆర్థిక సహాయం అందుతుంది.

అలాగే- ప్రతి సంవత్సరం మరో 30,000 రూపాయలను ఆ ఫౌండేషన్‌.. వినోద్ కాంబ్లికి అందజేస్తుంది. వైద్య ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ మొత్తం కాంబ్లికి అందుతుందని ఫౌండేషన్ వెల్లడించింది. దీన్ని సహాయంగా భావించట్లేదని, నిలదొక్కుకోవడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోన్నానని సునీల్ గవాస్కర్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+