రోహిత్-కొహ్లీ జోడీపై తేల్చేసిన గవాస్కర్..! నెక్ట్స్ జరిగేది ఇదే..!
ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో విఫలమైన భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలు అభిమానుల్ని తీవ్రంగా నిరాశపర్చారు. ఏడు నెలల తర్వాత తొలి వన్డే ఆడిన వీరిద్దరూ కేవలం 8, 0 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్ల చేతిలో పేలవంగా అవుటయ్యారు. దీంతో వీరిద్దరి భవిష్యత్తుపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్-కొహ్లీ జోడీపై క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో విఫలమైన స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ద్వయం తర్వాత జరిగే రెండు వన్డేల్లో పుంజుకుని భారీ స్కోర్లు చేసినా ఆశ్చర్యం లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అంతే కాదు తన అంచనాకు గల కారణాల్ని కూడా గవాస్కర్ వెల్లడించారు. పెర్త్ పిచ్ పై స్పందిస్తూ.. ఆస్ట్రేలియాలో అత్యంత బౌన్సీ పిచ్‌పై వారు ఆడారని, ముఖ్యంగా రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లకు ఇది అంత సులభం కాదని తెలిపారు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఆడే శుభ్‌మన్ గిల్ , శ్రేయాస్ అయ్యర్‌లకు ఇది సవాలుతో కూడుకున్నదన్నారు.

టీమిండియా ఇప్పటికీ చాలా మంచి జట్టు అని,వారు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్నారని గవాస్కర్ గుర్తుచేశారు. రోహిత్ , కోహ్లీ రాబోయే రెండు మ్యాచ్ లలో భారీ స్కోరు చేసినా ఆశ్చర్యపోవద్దని అభిమానుల్ని కోరారు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలు దూరంగా ఉన్న తర్వాత వారు తిరిగి వస్తున్నారని, వారు ఎంత ఎక్కువ ఆడితే, నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ త్రోడౌన్‌లను పొందుతారని తెలిపారు.

బహుశా 22 సంవత్సరాలకు బదులుగా 20 సంవత్సరాల నుండి వారిపై బౌలింగ్ చేస్తున్న రిజర్వ్ బౌలర్ల నుండి కూడా వారు త్వరగా తమ లైన్ ను తెలుసుకుంటారన్నారు. వారు ఓసారి పరుగులు తీయడం మొదలుపెడితే ఇండయా స్కోరు 300, 300-ప్లస్ దాటుతుందని గవాస్కర్ అంచనా వేశారు. వచ్చే మ్యాచ్ జరిగే అడిలైడ్ లో కొహ్లీకి మంచి బ్యాటింగ్ రికార్డు ఉందని గవాస్కర్ గుర్తుచేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications