T20 World Cupలో మరో సంచలనం

AFG vs NZ: టీ20 వరల్డ్ కప్ 2024లో మరో పెను సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో టైటిల్ హాట్ ఫేవరెట్ న్యూజిలాండ్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇదే తొలి మ్యాచ్ కూడా. పాకిస్తాన్ తరువాత ఆ స్థాయిలో ఓడిపోయిన జట్టు న్యూజిలాండే. 84 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ చేతిలో ఓడింది.

గ్రూప్- సీలో భాగంగా ప్రావిడెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్- 80 పరుగులతో సత్తా చాటాడు. మరో ఓపెనర్ ఇబ్రహీ జడ్రాన్- 44, అజ్మతుల్లా ఒమర్జాయ్- 22 పరుగులు చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లెవరూ సింగిల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు.

T20 World Cup 2024 AFG vs NA Afghanistan defeat New Zealand with 84 runs

అనంతరం ఛేజింగ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టీమ్ మొత్తం మీద ఇద్దరంటే ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అది కూడా 20 పరుగుల లోపే. ఓపెనర్ ఫిన్ అలెన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు.

ఆ తరువాత వరుసగా వికెట్లు నేలకూలాయి. డెవాన్ కాన్వే- 8, కేప్టెన్ కేన్ విలియమ్సన్- 9, డారిల్ మిఛెల్- 5, గ్లెన్ ఫిలిప్స్- 18, మార్క్ ఛాప్‌మన్- 4, మైఖెల్ బ్రేస్‌వెల్- 0, మిఛెల్ శాంట్నర్- 4, మాట్ హెన్రీ- 12, లోకీ ఫెర్గూసన్- 2, ట్రెంట్ బౌల్ట్- 3 (నాటౌట్) పరుగులు చేశారు. 15.2 ఓవర్లల్లో కివీస్ బ్యాటర్లు 75 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఫజల్ హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు చొప్పున పంచుకున్నారు. మహ్మద్ నబీ రెండు వికెట్లు కూల్చాడు. ఫారూఖీ 3.2 ఓవర్లల్లో 17 పరుగులు ఇచ్చి 4, రషీద్ ఖాన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తీసుకున్నారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్.. టోర్నమెంట్‌లో ముందంజ వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+