T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల సమయాలివే ? త్వరలో ఐసీసీ ప్రకటన..!
ఈ ఏడాది జూన్ లో టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 20 జట్లు పోటీ పడబోతున్నాయి. దీంతో మ్యాచ్ ల సంఖ్య కూడా భారీగానే ఉండబోతోంది. అయితే తొలిసారిగా అమెరికా,వెస్టిండీస్ వేదికలుగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మ్యాచ్ ల సమయాలు ఎలా ఉండాలనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. క్రికెట్ అభిమానులు భారీగా ఉన్న వివిధ దేశాల్లో ఎక్కువ మంది వీక్షించేందుకు అనువుగా సమయాల ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ల షెడ్యూల్ ను విడుదల చేసిన ఐసీసీ.. టైమింగ్స్ మాత్రం ప్రకటించలేదు. అయితే క్రికెట్ ను పిచ్చిగా ఆరాధించే భారత ఉపఖండంలో భారీ సంఖ్యలో ఉన్న అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ ఈ టోర్నీ మ్యాచ్ ల సమయాల్ని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న అంచనాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు, సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే భారత్ లో రాత్రి 7.30కి మొదలయ్యే మ్యాచ్ అమెరికా కాలమానం ప్రకారం చూస్తే ఉదయం 9 గంటలకు ఉంటుంది. దీంతో దీన్ని కూడా ఐసీసీ పరిశీలిస్తోంది.

వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ గమనిస్తే చాలా సంక్లిష్టంగా ఉంది. న్యూయార్క్‌తో సహా ఉత్తర అమెరికా వ్యాప్తంగా తొమ్మిది స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు ఉండబోతున్నాయి. జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చే లాంగ్ ఐలాండ్ మైదానాన్ని ఐసీసీ తాజాగా ప్రారంభించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే జూన్ 1న డల్లాస్ లో జరిగే తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా జట్టు కెనడాతో తలపడనుంది. టోర్నీ ఫైనల్ జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరుగుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications