Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024 Tickets: వరల్డ్ కప్ టికెట్ల సేల్స్ షురూ-ఐసీసీ కొత్త విధానం..!

ఈ ఏడాది జూన్ 1 నుంచి 29 వరకూ అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని మూడు, వెస్టిండీస్ లో ఆరు నగరాల్లో జరిగే 55 మ్యాచ్ ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈ మెగాటోర్నీ టికెట్ల అమ్మకాలను మొదలుపెట్టేసింది. దీంతో అభిమానులు ఆన్ లైన్లో టికెట్ల కోసం ఎగబడుతున్నారు.

మరోవైపు ఈ మెగా టీ20 టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు టికెట్ల కొనుగోలుకు సమాన హక్కులు కల్పించేందుకు ఐసీసీ ఈసారి అమ్మకాల విధానంలో మార్పులు చేసింది. దీని ప్రకారం ముందుగా వచ్చిన వారికి ముందుగా టికెట్లు అన్న విధానాన్ని పక్కనబెట్టింది. దీని స్ధానంలో పబ్లిక్ బ్యాలెట్ విధానంలో టికెట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇలా వారం రోజుల పాటు పెట్టే పబ్లిక్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ టికెట్లు పొందేందుకు సమాన అవకాశాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది.

T20 World Cup 2024 Tickets sale begins- here are full details..

అభిమానులు ఫిబ్రవరి 7వ తేదీ వరకూ ఒక్కో మ్యాచ్‌కి గరిష్టంగా ఆరు టిక్కెట్‌ల చొప్పున ఎన్ని మ్యాచ్‌లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.మొత్తం 260,000 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాలెట్ పూర్తయిన తర్వాత, మిగిలిన టిక్కెట్లు ఏవైనా ఉంటే ఫిబ్రవరి 22నుంచి tickets.t20worldcup.comలో సాధారణ విక్రయానికి పెడతారు. మెజారిటీ అభిమానులకు క్రికెట్ విందు అందించేందుకు వీలుగా టికెట్ ధరల్ని అందుబాటులో ఉంచారు.

మ్యాచ్ టికెట్ల ధరలు 6 డాలర్ల నుంచి ప్రారంభమై 25 డాలర్ల వరకూ ఉన్నాయి. బ్యాలెట్ టైం ముగిసిన తర్వాత, టికెట్లు పొందిన వారికి పూర్తి వివరాలతో ఈ మెయిల్, పేమెంట్ లింక్ కూడా పంపుతారు. నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోతే మాత్రం ముందుగా వచ్చిన వారికి ముందుగా ఇచ్చే ప్రాతిపదికన సాధారణ విక్రయం కోసం విడుదల చేసే టికెట్ పూల్ కు వీటిని బదిలీ చేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+