T20 World Cup Super 8: రసవత్తరంగా సూపర్ 8 రేస్-ముగ్గురు ఎంట్రీ-మరో 5 బెర్తుల్లో..!
టీ20 వరల్డ్ కప్ లో (T20 World Cup 2026)గ్రూప్ దశ పోరు ముందుకు సాగుతున్న కొద్దీ సూపర్ 8 రేస్ మరింత రసవత్తరంగా మారుతోంది. నిన్నటి వరకూ గ్రూప్ దశలో 27 మ్యాచ్ లు ముగిశాయి. ఇవాళ మరో మూడు మ్యాచ్ లు ఉన్నాయి. నిన్నటివరకూ సమీకరణాల్ని చూసుకుంటే రేసులో ఉన్న టాప్ జట్లలో మూడు ఇప్పటికే సూపర్ 8 లోకి ప్రవేశించాయి. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. దీంతో మిగిలిన ఐదు స్ధానాల కోసం ఇప్పుడు గట్టి పోటీ నెలకొంది.
టీ20 వరల్డ్ కప్ లో నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్ల చొప్పున మొత్తం 20 జట్లు సూపర్ 8 రేసులో నిలిచాయి. వీటిలో నిన్న భారత్-పాక్ మ్యాచ్ ముగిసేసరికి భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా హ్యట్రిక్ విజయాలతో సూపర్ 8లోకి అడుగుపెట్టినట్లయింది. దీంతో ఇక మిగిలిన ఐదు బెర్తుల కోసం నాలుగు గ్రూపుల్లోనూ పోటీ నెలకొంది. ఇందులో గ్రూప్ ఏలో చూసుకుంటే భారత్ ఇప్పటికే సూపర్ 8లోకి అడుగుపెట్టడంతో మరో బెర్త్ కోసం పాకిస్తాన్, అమెరికా మధ్య పోటీ నెలకొంది. అయితే అమెరికా ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడేసి 4 పాయింట్లు మాత్రమే సాధించింది. పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ మిగిలుంది. ఇందులో నెగ్గితే పాకిస్తాన్ కు సూపర్ 8 ఛాన్స్ దక్కుతుంది. ఓడితే అమెరికాతో నెట్ రన్ రేట్ లో పోడీ పడాల్సి వస్తుంది.

ఇక గ్రూప్ బీ విషయానికొస్తే.. ఇందులోని ఐదు జట్లలో ఒక్కటి కూడా ఇప్పటిదాకా సూపర్ 8కు చేరుకోలేదు. శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య గట్టి పోటీ ఉన్న ఈ గ్రూప్ లో ఈ మూడు జట్లకూ తలో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. అలాగే శ్రీలంక, జింబాబ్వే నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ఇవాళ శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఇందులో శ్రీలంక గెలిస్తే సూపర్ 8కు వెళ్లే ఛాన్స్ దక్కుతుంది. ఆసీస్ గెలిస్తే ఈ మూడు జట్ల మధ్య సూపర్ 8 రేస్ మరింత క్లిష్టంగా మారుతుంది. అలాగే గ్రూప్ సీలో వెస్టిండీస్ ఇప్పటికే సూపర్ 8కు చేరింది. మరో బెర్త్ కోసం ఇంగ్లాండ్, స్కాట్లండ్, ఇటలీ మధ్య పోటీ ఉంది. అయితే ఇందులో స్కాట్లండ్ మిగతా రెండు జట్ల కంటే మెరుగైన రన్ రేట్ లో ఉంది. దీంతో పాయింట్ల ఆధారంగా చూస్తే ఇంగ్లండ్ కు అవకాశం ఉంది.

అలాగే గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ లూ గెలిచి సూపర్ 8కు చేరుకుంది. దీంతో రెండో బెర్త్ కోసం న్యూజీలాండ్, యూఏఈ మధ్య పోటీ ఉంది. కివీస్ కు మరో మ్యాచ్, యూఏఈకి మరో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. అయితే ఇక్కడ కివీస్ కే సూపర్ 8 ఛాన్స్ ఉంది. ఈ లెక్కన చూస్తే భారత్, విండీస్, దక్షిణాఫ్రికా తర్వాత సూపర్ 8లోకి ప్రవేశించే అవకాశం ఉన్న జట్లు శ్రీలంక, ఆసీస్, జింబాబ్వే, ఇంగ్లండ్, న్యూజీలాండ్, పాకిస్తాన్ కనిపిస్తున్నాయి. ఇవాళ రేపట్లో మరో రెండు బెర్త్ లు ఖరారయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications