T20 World Cup 2026: మళ్లీ టీమ్ లోకి ఆ తెలుగు ప్లేయర్-టీమిండియాకు భారీ ఊరట..!
టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026) ఆరంభానికి ముందు టీమిండియాకు మరో గుడ్ న్యూస్ అందింది. తాజాగా న్యూజీలాండ్ తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ను ఏకంగా 4-1 తేడాతో గెల్చుకున్న భారత జట్టు ఇప్పుడు మెగా టోర్నీ కోసం సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో కివీస్ తో టీ20 సిరీస్ కు దూరమైన ఈ కీలక ఆటగాడు జట్టులోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అతను త్వరలో టీమిండియా ఆడే రెండు వార్మప్ గేమ్ లలో ఆడి ఫిట్ నెస్ నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
మళ్లీ టీమ్ లోకి తిలక్ వర్మ (tilak varma)
హైదరాబాదీ లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ (tilak varma) గతంలో గాయపడి ఆపరేషన్ చేయించుకున్నాడు. దీంతో బెంగళూరులోని జాకీయ క్రికెట్ అకాడమీలో ఉంటూ గాయం నుంచి కోలుకున్నాడు. తాజాగా అతని పరిస్ధితిని సమీక్షించిన బీసీసీఐ.. టీ20 వరల్డ్ కప్ లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తిలక్ వర్మ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్ ల్లోనూ ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఇందులో ఫిట్ నెస్ నిరూపించుకుంటే ఇక మెగా టోర్నీలో తిలక్ ఆడటం లాంఛనమే.

గాాయం నుంచి కోలుకుని
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా గాయం కావడంతో తిలక్ వర్మ వృషణాలకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో తిలక్ వర్మ దాదాపు నెల రోజులుగా ఆటకు దూరంగా ఉన్నాడు. అతన్ని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు పంపి ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇప్పించారు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ తాజాగా హై-ఇంటెన్సిటీ సిమ్యులేషన్ మ్యాచ్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతనికి టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు అనుమతి లభించింది.

వార్మప్ మ్యాచ్ లకు రెడీ
రేపు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో అమెరికా జట్టుతో జరిగే ఇండియా-ఏ వార్మప్ మ్యాచ్ లో తిలక్ వర్మ ఆడబోతున్నాడు. ఆ తర్వాత అధికారికంగా సీనియర్ జట్టుతో చేరతాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 4న జరిగే భారత జట్టు వార్మప్ మ్యాచ్ లో ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. అక్కడా నిరూపించుకుంటే టీమిండియాలో అతని స్ధానానికి ఢోకా లేనట్లే.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications