T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..!
టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) రెండో సెమీ ఫైనల్ దశకు చేరుకుంది. నిన్న జరిగిన తొలి సెమీ పైనల్లో అజేయ దక్షిణాఫ్రికాను పడుతూ లేస్తూ సెమీస్ కు చేరిన న్యూజీలాండ్ అనూహ్యంగా చిత్తు చేసేసింది. తద్వారా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. దీంతో ఇంత సునాయాసంగా దక్షిణాఫ్రికాను న్యూజీలాండ్ ఎలా ఓడించగలిగింది, ఏ వ్యూహం ఇందుకు అమలు చేసిందన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతోంది. దీనిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (irfan pathan) స్పందించాడు.
నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్ మ్యాచ్ పై ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఇందులో దక్షిణాఫ్రికాపై కివీస్ విజయం వెనుక రహస్యం బయటపెట్టాడు. న్యూజిలాండ్ ఎప్పుడూ ఒక ప్రణాళికతో వస్తుందని, అందులో తలమునకలై పని పూర్తి చేస్తుందని పఠాన్ తెలిపాడు. ఈరోజు వారు పవర్ ప్లేలో మెక్కాంచీతో బౌలింగ్ చేయించాలని ప్లాన్ వేశారని గుర్తుచేశాడు. అతను రెండు వికెట్లు పడగొట్టాడని, ఆ తర్వాత బౌలింగ్ చేయలేదని తెలిపాడు.

New Zealand always comes with a plan. Doesn’t get overwhelmed by it and gets the job done. Today they made a plan to bowl McConchie in the powerplay. He got two wickets and didn’t bowl after that. Plan it, execute it and move on. That’s the mantra of NZ. What a win vs South…
— Irfan Pathan (@IrfanPathan) March 4, 2026
తద్వారా ప్లాన్ చేసి, దాన్ని అమలు చేసి ముందుకు సాగాలని రెండో సెమీ పైనల్ కు సిద్దమవుతున్ భారత్ కు ఇర్పాన్ పఠాన్ సూచించాడు. అదే న్యూజీలాండ్ మంత్రం అన్నాడు. అందుకే దక్షిణాఫ్రికాపై ఎంత గొప్ప విజయం సాధించిందని కివీస్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అంటే మైదానంలో పక్కా ప్లాన్ తో దిగితే ఎంత బలమైన జట్టును అయినా ఓడించే అవకాశం ఉంటుందనేది ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ సారాంశం. గతంలో సూపర్ 8 తొలి మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికా ఇలాగే భారత్ ను పక్కా ప్లాన్ తో కట్టడి చేసి అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు అదే జట్టు కివీస్ ప్లాన్ కు లొంగిపోయింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications