Ind vs Zim: టీమిండియా సమస్య అదే-అందుకే ఆ మార్పు? తేల్చేసిన బ్యాటింగ్ కోచ్..!

టీ20 వరల్డ్ కప్ ( T20 world cup 2026)లో గ్రూప్ దశను విజయవంతంగా దాటేసి సూపర్ 8లోకి అజేయంగా అడుగుపెట్టిన టీమిండియాకు దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఓటమి రూపంలో తొలి దెబ్బ తగిలింది. ఇప్పుడు మిగిలిన జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్ లను భారీ తేడాతో గెల్చుకోకపోతే సెమీస్ కు వెళ్లడం కూడా కష్టమే. దీంతో టీమిండియా తమ సమస్య ఏంటో గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగా అసలు సమస్య టాప్ ఆర్డరే అని బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ తేల్చేశారు.

ఈ మధ్య ఆడిన మ్యాచ్ లలో మూడు ప్రారంభ వికెట్లు కోల్పోవడం, ఇద్దరు ఎడమచేతి వాటం ఓపెనర్లు ఉండటం, 3వ స్థానంలో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఉండటం టీం ఇండియాకు సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ ఇవాళ ప్రెస్ మీట్ లో పరోక్షంగా వెల్లడించారు. జట్టు నిరంతరం కాంబినేషన్ల గురించి చర్చిస్తుందని ఆయన తెలిపాడు. టాప్ ఆర్డర్ లో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బౌలర్లు ఉండటం, వారిపై ప్రత్యర్థి బౌలింగ్ ఎంపికలు ఎలా ఉంటాయన్న దానిపై ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

T20 world cup Massive Tweak Coming Sanju Samson Nears Team India Return for Zimbabwe Clash

ఫైనల్ గా జింబాబ్వేతో మ్యాచ్ కు జట్టులో మార్పులు ఉంటాయని బ్యాటింగ్ కోచ్ తేల్చేశారు. అవును, తమకు ఓపెనర్లుగా ఇద్దరు ఎడమచేతి వాటం బౌలర్లు, మూడవ స్థానంలో ఎడమచేతి వాటం బౌలర్ ఉన్నారన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ఆఫ్ స్పిన్నర్ కూడా ఉన్నాడు కాబట్టి మేము ప్రతిదీ చర్చిస్తున్నామన్నాడు. గత మూడు మ్యాచ్‌లలో మొదటి ఓవర్‌లోనే తాము వికెట్లు కోల్పోయినందున, ఏ జట్టు అయినా మార్పుల గురించి ఆలోచిస్తుందన్నారు. తాము ఎప్పుడూ జట్టును చాలా త్వరగా నిర్ణయించమని, ముందుగానే ప్రణాళికలను వెల్లడించడం న్యాయం కాదని తెలిపారు. అయితే మార్పులపై మాత్రం కచ్చితంగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైట్ హ్యాండ్ ఓపెనర్ అయిన సంజూ శాంసన్ ను తీసుకోవడం ఖాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+