IPL 2026 Second Phase Schedule: ఐపీఎల్ రెండో విడత షెడ్యూల్-50 మ్యాచ్ ల తేదీలివే..!
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)కు తొలి విడత షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. ఇవాళ రెండో విడత షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ఇరాన్ వార్, దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రెండో దశల్లో షెడ్యూల్ విడుదల చేయాలని ముందే నిర్ణయించిన బీసీసీఐ.. అనుకున్నవిధంగానే వీటిని రిలీజ్ చేసింది. ఇవాళ విడుదల చేసిన రెండో విడత షెడ్యూల్ ప్రకారం 50 మ్యాచ్ లను ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకూ నిర్వహిస్తారు.
రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 13న హైదరాబాద్ లో సన్ రైజర్స్-రాజస్తాన్ మ్యాచ్, ఏప్రిల్ 14న చెన్నైలో చెన్నై-కోల్ కతా మ్యాచ్, ఏప్రిల్ 15న బెంగళూరులో ఆర్సీబీ-లక్నో మ్యాచ్, 16న ముంబైలో ముంబై-పంజాబ్ మ్యాచ్, 17న అహ్మదాబాద్ లో గుజరాత్-కోల్ కతా మ్యాచ్, 18న మధ్యాహ్నం బెంగళూరులో ఆర్సీబీ-ఢిల్లీ, రాత్రికి హైదరాబాద్ లో సన్ రైజర్స్-చెన్నై మ్యాచ్ లు ఉంటాయి. 19న కోల్ కతాలో నైట్ రైడర్స్-రాజస్థాన్, చండీఘడ్ లో పంజాబ్-లక్నో మ్యాచ్ లు నిర్వహిస్తారు. 20న అహ్మదాబాద్ లో గుజరాత్-ముంబై, 21న హైదరాబాద్ లో సన్ రైజర్స్-ఢిల్లీ, 22న లక్నోలో లక్నో-రాజస్థాన్, 23న ముంబైలో ముంబై-చెన్నై, 24న బెంగళూరులో ఆర్సీబీ-గుజరాత్, 25న ఢిల్లీలో ఢిల్లీ-పంజాబ్, జైపూర్ లో రాజస్తాన్-సన్ రైజర్స్ మ్యాచ్ లు ఉంటాయి.

26న అహ్మదాబాద్ లో గుజరాత్-చెన్నై, లక్నోలో లక్నో-కోల్ కతా మ్యాచ్ లు ఉంటాయి. 27న ఢిల్లీలో ఢిల్లీ-ఆర్సీబీ, 28న చంఢీఘడ్ లో పంజాబ్-రాజస్థాన్, 29న ముంబైలో ముంబై-సన్ రైజర్స్, 30న అహ్మదాబాద్ లో గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్ లు ఉంటాయి. అనంతరం మే 1న జైపూర్ లో రాజస్తాన్-ఢిల్లీ, మే2న చెన్నైలో చెన్నై-ముంబై, మే3న హైదరాబాద్ లో సన్ రైజర్స్-కోల్ కతా, అహ్మదాబాద్ లో గుజరాత్-పంజాబ్ మ్యాచ్ లు ఉంటాయి. మే4న ముంబైలో ముంబై-లక్నో, మే 5న ఢిల్లీ-చెన్నై, 6వ తేదీ హైదరాబాద్ లో సన్ రైజర్స్-పంజాబ్, 7న లక్నోలో లక్నో-ఆర్సీబీ, 8న ఢిల్లీలో ఢిల్లీ-కోల్ కతా మ్యాచ్ లు ఉంటాయి.
ఫుల్ షెడ్యూల్ లింక్: {document1}
9న జైపూర్ లో రాజస్తాన్-గుజరాత్, 10న చెన్నైలో చెన్నై-లక్నో, రాయ్ పూర్ లో ఆర్సీబీ-ముంబై మ్యాచ్ లు ఉంటాయి. అలాగే మే 11న ధర్మశాలలో పంజాబ్-ఢిల్లీ, మే 12న అహ్మదాబాద్ లో గుజరాత్-సన్ రైజర్స్, మే 13న రాయ్ పూర్ లో ఆర్సీబీ-కోల్ కతా, 14న ధర్మశాలలో పంజాబ్-ముంబై, 15న లక్నోలో లక్నో-చెన్నై, 16న కోల్ కతాలో కోల్ కతా-గుజరాత్, 17న ధర్మశాలలో పంజాబ్-ఆర్సీబీ, ఢిల్లీలో ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. 18న చెన్నైలో చెన్నై-సన్ రైజర్స్, 19న జైపూర్ లో రాజస్థాన్-లక్నో, 20న కోల్ కతాలో కోల్ కతా-ముంబై, 21న చెన్నైలో చెన్నై-గుజరాత్, 22న హైదరాబాద్ లో సన్ రైజర్స్-ఆర్సీబీ, 23న లక్నోలో లక్నో-పంజాబ్, 24న ముంబైలో ముంబై-రాజస్థాన్, కోల్ కతాలో కోల్ కతా-ఢిల్లీ మ్యాచ్ లు ఉంటాయి. ఇక్కడితో లీగ్ దశ ముగుస్తుంది.
-
బీసీసీఐ రూల్స్ బ్రేక్.. రాజస్థాన్ రాయల్స్‌కు చిక్కులు! -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా? -
అందరి నోళ్లూ ముయించాడు గానీ.. -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
రోహిత్, శార్దూల్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు: చిన్ననాటి కోచ్ వీడియో -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
గిదేం ఆట సామీ?: నువ్వు తోపువనుకుంటే తుస్సుమన్నావ్ కదా! -
DC vs GT: ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా ? ఆ రెండు బాల్స్ ..!












Click it and Unblock the Notifications