నీ ఆటకు గులాం అవ్వాల్సిందే బాసూ..!

టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనను అద్భుతమైన విజయంతో ముగించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆఖరిదైన ఐదవ టెస్టులో భారత్ ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 2-2తో సమం చేసి, ఈ చారిత్రక సిరీస్‌ను మరింత స్పెషల్‌గా నిలిపింది.

ఉత్కంఠభరితమైన ఆఖరి రోజు
339/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు మొదట కొంత ఊరట లభించినా, భారత బౌలర్లు చివరి రోజు అద్భుత ప్రదర్శన చేశారు. ఇంగ్లండ్‌ 367 పరుగులకు ఆలౌటవ్వగా, మహమ్మద్ సిరాజ్ (5/104) ఐదు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు.

Team India wins against England

సిరాజ్ మ్యాజిక్, ప్రసిధ్ సపోర్ట్
ఆఖరి రోజు ఆటలో జెమీ ఓవర్టన్ దూకుడుగా రెండు బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. కానీ, సిరాజ్ మ్యాజిక్ వెంటనే మొదలైంది. జెమీ స్మిత్‌ను (2) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. తన మరుసటి ఓవర్‌లోనే దూకుడుగా ఆడుతున్న జెమీ ఓవర్టన్‌ను (9) వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు.

ఇక ప్రసిధ్ కృష్ణ కూడా తనవంతు పాత్ర పోషించాడు. జోష్ టంగ్‌ను (0) ఒక స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మరింత ఉత్కంఠగా మార్చాడు. ఈ వికెట్ తర్వాత క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసేందుకు సాహసం చేసి, అట్కిన్సన్ సహాయంతో జట్టు విజయం కోసం పోరాడాడు.

క్లైమాక్స్‌లో సిరాజ్ అద్భుతం
ఒకానొక సమయంలో సిరాజ్ బౌలింగ్‌లో అట్కిన్సన్ భారీ షాట్ కొట్టగా, బౌండరీ లైన్‌పై ఆకాష్ దీప్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అది సిక్సర్‌గా మారింది. అయితే, సిరాజ్ పట్టు వదలలేదు. అదే ఓవర్‌లో తర్వాతి మూడు బంతులను డాట్ చేసి, ఆఖరి బంతికి బై రూపంలో ఒకే ఒక్క సింగిల్ ఇచ్చి మళ్ళీ అట్కిన్సన్‌ను స్ట్రైకింగ్‌లోకి తీసుకొచ్చాడు.

ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో అట్కిన్సన్ మూడు పరుగులు చేసి మళ్ళీ స్ట్రైక్ తీసుకున్నాడు. కానీ, సిరాజ్ ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి, భారత విజయాన్ని లాంఛనం చేశాడు. సిరాజ్ ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ విజయం టీమిండియాకు ఎంతగానో అవసరమైన బూస్ట్‌ను ఇచ్చింది. ఈ సిరీస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+