సౌతాఫ్రికాతో సూపర్ 8కు టీమిండియాలో కీలక మార్పులు..! గవాస్కర్ అంచనా..!
టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026) లో భాగంగా దక్షిణాఫ్రికాతో వచ్చే ఆదివారం జరిగే సూపర్ 8 మ్యాచ్ (india south Africa match) కు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే ఇప్పటికే గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లలో ఎదురైన అనుభవాలు, ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్, ఇతర అంశాల్ని దృష్టిలో ఉంచుకొని భారత జట్టులో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ మేరకు క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తన అంచనాలను వెల్లడించారు.
ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో కీలక మార్పుల్ని గవాస్కర్ అంచనా వేస్తున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్ పై ఇప్పటికే నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడిన భారత్ కు అక్కడి పరిస్ధితులపై పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే బౌలింగ్ లో కీలక మార్పులు చేయాలని చూస్తోంది. గవాస్కర్ లెక్క ప్రకారం గత మ్యాచ్ ఆడిన పేసర్ అర్ష్ దీప్ సింగ్ కు టీమిండియా విశ్రాంతి ఇవ్వబోతోంది. అలాగే స్పిన్నర్ అక్షర్ పటేల్ కు జట్టులో స్ధానం దక్కబోతోంది.

నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ తో పాటు అర్ష్ దీప్ సింగ్ కూడా ఆడారు. అప్పుడు అక్షర్ పటేల్ కు విశ్రాంతి నిచ్చారు. కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు అర్ష్ దీప్ స్ధానంలో స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు అవకాశం ఇవ్వబోతున్నారు. అలాగే వాషింగ్టన్ సుందర్ ను కూడా కొనసాగిస్తారని గవాస్కర్ అంచనా వేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడి పిచ్ పై ఎక్కువ టర్న్ ఉండట్లేదు. అందుకే సుందర్ సరిపోతాడని, అదే సమయంలో బ్యాటింగ్ కూ పనికొస్తాడని టీమ్ మేనేజ్ మెంట్ అంచనా వేస్తోందట. సుందర్ కొనసాగింపుతో జట్టు బ్యాటింగ్ లో తొమ్మిదో నంబర్ వరకూ పటిష్టంగా ఉంటుందని గవాస్కర్ తెలిపాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications