రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ కీలక నిర్ణయం - "మాస్టర్" స్ట్రోక్..!!
ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి తరువాత టీం ఇండియా భవిష్యత్ కూర్పు పైన చర్చ మొదలైంది. టీం కోచ్ తో సహా పలువురు సీనియర్ల ప్రస్థానం పైన అనుమానాలు మొదలయ్యాయి. వచ్చే ప్రపంచ కప్ సమయానికి ప్రస్తుత టీంలో కీలకంగా ఉన్న రోహిత్, కోహ్లీ, షమీ లాంటి వారు అందుబాటులో ఉంటారా లేదా అనేది సందేహమే. ఈ సమయంలోనే కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తప్పించటం ఖాయమనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే బీసీసీఐ నుంచి రాహుల్ ను బంపరాఫర్ వచ్చింది.
టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం వరల్డ్ కప్ 2023తో ముగిసింది. పొడిగింపునకు ద్రావిడ్ సుముఖంగా లేకపోవడంతో కొత్త కోచ్‌ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే ద్రావిడ్‌ను బీసీసీఐ సంప్రదించినట్టు తెలుస్తోంది. కోచ్ కాంట్రాక్ట్ పొడిగింపు ఆఫర్‌ను ఇచ్చినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే ద్రావిడ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని సమాచారం. ద్రవిడ్‌ను కోచ్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడానికి కారణం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత రెండేళ్లుగా నిరంతరంగా పనిచేస్తున్న టీంనే కొనసాగించాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌నకు ముందు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌కు రావాల్సిన ఇంగ్లండ్‌కు, సౌతాఫ్రికాకు స్వాగతం పలికేందుకు రాహుల్ ద్రవిడ్ సిద్ధమవ్వాల్సి ఉంటుంది. బీసీసీఐ ఆఫర్ కు ద్రావిడ్ సానుకూలంగా స్పందించకపోతే ప్రస్తుతం ఎన్‌సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ) చీఫ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరి కోసం బీసీసీఐ కాంట్రాక్ట్ పత్రాలను సిద్ధం చేసిందని మరొక రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియాను పర్యవేక్షిస్తున్నారు.
రాహుల్ ను కొనసాగించినా.. లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. కొత్త బాధ్యతలు దక్షిణాఫ్రికా పర్యటన నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబరు 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భారత్ 3 టీ20 ఇంటర్నేషనల్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇది కాకుండా, ఈ పర్యటనలో 2 టెస్టులు కూడా ఆడనున్నాయి. ఒకటి డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో, మరొకటి జనవరి 3 నుంచి కేప్ టౌన్‌లో జరగనుంది. దీంతో, ఇప్పుడు ద్రావిడ్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications