మురిసిపోతున్న నీతా అంబానీ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో మూడు నెలల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి.

రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది. దీని కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు సాగుతున్నాయి. ఐపీఎల్ రిటెన్షన్ (IPL 2024 Retention) సైతం ముగిసింది. పలువురు ప్లేయర్లు ఇతర జట్లకు వెళ్లారు.

Thrilled to welcome Hardik Pandya back home, says Nita Ambani

ఈ సీజన్ వరకు గుజరాత్ టైటన్స్‌ (Gujarat Titans)కు కేప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya) జట్టును వదిలాడు. రిటెన్షన్ సందర్భంగా అతన్ని రిలీజ్ చేసింది జీటీ (GT) ఫ్రాంఛైజీ యాజమాన్యం. ఆ తరువాత అతన్ని 5.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది గానీ అది నిలవలేదు. 7.50 కోట్ల రూపాయలకు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అతన్ని తీసుకుంది.

గత ఏడాదే ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. ఆ ఏడాదే ఛాంపియన్‌గా నిలిచింది. అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే ట్రోఫీని ఎగరేసుకెళ్లిన జట్టుగా ఆవిర్భవించింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కూడా దుమ్ము లేపింది జీటీ. ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.

వరుసగా రెండు సీజన్లల్లో జట్టును ఫైనల్స్ చేర్చడంతో పాటు ఒకసారి టైటిల్ విన్నర్‌గా నిలిపిన రికార్డును సొంతం చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. ఈ రెండు సీజన్లలోనే తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ జట్టును మోస్ట్ సక్సెస్ ఫుల్‌ టీమ్ నిలపగలిగాడీ ఆల్ రౌండర్.

Thrilled to welcome Hardik Pandya back home, says Nita Ambani

గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లడానికి ముందు ముంబై ఇండియన్స్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగాడు హార్దిక్ పాండ్యా. 92 మ్యాచ్‌లను ఆడాడు. 1,476 పరుగుల చేశాడు. కొన్ని మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో ఆల్ రౌండర్‌గా సత్తా చాటాడు.

అలాంటి ప్లేయర్ మళ్లీ సొంత గూటికి రావడం పట్ల ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కో- ఓనర్ నీతా అంబానీ స్పందించారు. హార్దిక్‌ను సంతోషంగా స్వాగతిస్తోన్నానని అన్నారు. అతను మళ్లీ తమ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో రీ యూనిట్ అయ్యాడని వ్యాఖ్యానించారు. ముంబై ఇండియన్స్ టీమ్‌ను తన స్కౌటెడ్ టాలెంట్‌తో మరోసారి గెలిపిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+