IPL 2025: 100 గోళీలు వేసుకున్న పెళ్లికొడుకులు..! రప్పా.. రప్పా

అబ్బబ్బ ఏం కొట్టుడు సామీ.. బ్యాట్ విరిగిపోతే ఎవడు రెస్పాన్స్ బిలిటీ.. మనిషన్నాక కూసింత జాలి దయ ఉండాలిగా.. ఆ మాత్రం కూడా ఓపిక లేకపోతే మీరు మనుషులా.. మృగాలా..? అన్న డౌట్ కూడా వస్తుంది ఆడియన్స్ కు.. ఇన్ని మాటలూ సరిపోవు వీళ్ల బ్యాటింగ్ కు.. అవును పేరుకే సన్ రైజర్స్.. వీళ్ల విధ్వంసం మొత్తం నైటే.. సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే విక్టరీతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి మ్యాచ్ ల్లోనే భారీ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జోరు మీదుంది. అదే ఉత్సాహంతో మార్చి 27న ఉప్పల్ వేదికగా లఖ్​నవూతో జరగనున్న మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.

మరి సన్ రైజర్స్ హైదరాబాద్ అసలైన మొగుళ్లు ఎవరో తెలుసా..? వీళ్లు గ్రౌండ్ లోకి దిగారంటే.. 100 గోళీలు వేసుకున్న పెళ్లికొడుకు శోభనం గదిలోకి వెళ్లినట్లేన్నమాట. మరి అంతలా సన్ రైజర్స్ తరఫున బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆటగాళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ మన వార్నర్ భయ్యాదే.. సన్ రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ అనేక సార్లు జట్టును కాపాడాడు. ఇక 2017లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 126 పరుగులు అది కూడా కేవలం 59 బంతుల్లో రాబట్టి సంచలనం క్రియేట్ చేశాడు. అందుకే ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

Top Batters Who Have Scored Centuries for Sunrisers A Look Back

ఇక రెండో స్థానంలో జానీ బెయిర్ స్టో ఉన్నాడు. సన్ రైజర్స్ తరఫున ఆడిన బెయిర్ స్టో 2019లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం 56 బంతుల్లోనే 114 వ్యక్తిగత స్కోర్ సాధించి ఔరా అనిపించాడు. ఇక మూడో స్థానాన్ని మళ్లీ డేవిడ్ వార్నర్ కైవసం చేసుకున్నాడు. వార్నర్ 2019లో ఆర్సీబీ తరఫున కేవలం 55 బంతుల్లో 100 పరుగులతో హిస్టరీ క్రియేట్ చేశాడు. ఎంతైనా ఫాస్టెస్ట్ బ్యాటింగ్ చేయాలంటే తనతోనే సాధ్యం అని మరోసారి నిరూపించాడు.

All centuries scored by Sunrisers Hyderabad batters
byu/ipdsj inCricket

నాలుగో ప్లేస్ లో హ్యారీ బ్రూక్ ఉన్నాడు. 2023లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత ఐదో ప్లేస్ లో కూకట్ పల్లి క్లాసెన్ ఉన్నాడు. మన క్లాసెన్ భయ్యా 2023లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చుచ్చుపోయించాడు. 54 బంతుల్లో 104 పరుగులతో చెలరేగిపోయాడు. మరి ఈ సీజన్లో మన కాటేరమ్మ కొడుకు ఇంకెన్ని బంతుల్ని రప్పా రప్పా చేస్తాడో చూడాలి.

Take a Poll

ఆరోస్థానంలో హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. గతేడాది ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం 41 బంతుల్లోనే హెడ్.. తన బ్యాట్ తో చెలరేగిపోయాడు. 102 రన్స్ తో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక తాజాగా 18వ సీజన్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ పై గర్జించాడు. కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేసి స్టేడియాన్ని దున్నేశాడు. మరి రానున్న మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ రారాజులు ఇంకెన్ని స్టేడియాల్ని దున్నేస్తారో.. ఎన్ని రికార్డులు బద్ధలు కొడతారో వేచి చూడాలి. ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+