Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరె ఓ సాంబా.. ఇంకో రెండు పాయింట్లు ఇచ్చుకో

ఐపీఎల్ 2026లో భాగంగా నేడు డబుల్ హెడ్డర్స్ జరుగనున్నాయి. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. న్యూ చండీగఢ్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం దీనికి వేదిక. మరొకటి ఈ సాయంత్రం 7:30 గంటలకు షెడ్యూల్ అయింది. చెపాక్ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ కేపిటల్స్ మధ్య జరుగుతుందీ బిగ్ క్లాష్.

ఇప్పటివరకు ఓటమి అనేదే ఎరుగని జట్టు పంజాబ్ కింగ్స్. ఆడిన మూడు మ్యాచ్ లల్లో రెండింట్లో నెగ్గింది. వర్షం వల్ల ఒక మ్యాచ్ రద్దయింది. మొత్తం అయిదు పాయింట్లతో టేబుల్ రెండో స్థానంలో నిలిచింది. నేడు తన తదుపరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీ కొట్టడానికి సన్నద్ధమైంది. తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటివరకు ఆడిన జట్లతోనే సొంత గడ్డపై సన్ రైజర్స్ తో తలపడే అవకాశం ఉంది.

Unbeaten Punjab Kings set to Take on Sunrisers Hyderabad Strong Playing 11 today Clash of Firepower

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ కింగ్స్ సమతుల్యత ప్రదర్శిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 200+ పరుగుల ఛేదన, ముల్లన్‌పూర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విజయం వారి బలానికి నిదర్శనం. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కానొలీ, విజయ్‌కుమార్ వైశాఖ్ వంటి ఆటగాళ్లు మెరుపులు మెరిపిస్తోన్నారు. పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ అంచనాలకు మించి రాణిస్తోన్నాడు. ఇదే దూకుడు నేటి మ్యాచ్ లోనూ ప్రదర్శించడం ఖాయం.

పంజాబ్ కింగ్స్ కు పూర్తి భిన్నంగా ఉంది సన్ రైజర్స్ పరిస్థితి. నిలకడలేమితో కొట్టుమిట్టాడుతోంది. దూకుడుకు ఆడుతుందనే పేరున్నప్పటికీ- నిలకడగా పోరాడట్లేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ సరిగా లేకపోవడంతో మిడిలార్డర్ పై ఒత్తిడి పడుతోంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లు రాణిస్తున్నా హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ తో కూడిన బౌలింగ్ యూనిట్ అంచనాలను అందుకోలేకపోతోంది.

లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన విషయం తెలిసిందే. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే ధాటిగా ఆడారు. జట్టును కాపాడారు. నితీష్ రెడ్డి ఎప్పుడు ఎలా ఆడతాడో కూడా తెలియదు. లక్నోపై మ్యాచ్ లో ఫామ్ అందుకున్న ఈ బ్యాటర్.. దాన్ని ఈ మ్యాచ్ లో కొనసాగిస్తాడా అంటే అనుమానమే. అతని బ్యాటింగ్ లో స్థిరత్వం ఉండట్లేదు. క్లాసెన్ బ్యాటింగ్ పై అనుమానాల్లేవు. నిలకడగా ఆడుతున్నాడు.

పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, నెహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఆడొచ్చు.

ఇంపాక్ట్ ప్లేయర్: ప్రియాన్ష్ ఆర్య.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11లో- అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, హర్ష్ దూబే, శివం కుమార్, జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ కు చోటు దక్కే అవకాశం ఉంది.

ఇంపాక్ట్ ప్లేయర్: ఇషాన్ మలింగ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+