పాకెట్ డైనమో ఇంకో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు.. జింబాబ్వేతో తలపడుతోంది. గ్రూప్ 2 సూపర్ సిక్సెస్ లో భారత్ ఆడుతోన్న కీలక గేమ్ ఇది. బులావయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ పోరులో టాస్ ఓడిపోయ తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ప్రతాపం చూపుతోంది. దూకుడుగా ఆడుతోంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోర్ 100 పరుగులు దాటిందంటే బ్యాటర్లు ఎంత ధాటిగా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు గేర్ మార్చడంతో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది.

ఇన్నింగ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన టీమిండియా. బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ ఆరంభించారు. రెండో ఓవర్‌లో మైఖేల్ బ్లిగ్నాట్ బౌలింగ్‌లో జార్జ్, వైభవ్ కలిసి 15 రన్స్ కొట్టారు. 4 ఓవర్లలోనే 44 పరుగులు చేసిందీ ఓపెనింగ్ జోడి. అయిదో ఓవర్ తొలి బంతికి ఆరోన్ జార్జ్ భారీ షాట్ ఆడబోయి పనాషే మజాయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అప్పటికి భారత జట్టు 6 ఓవర్లలో 59 రన్స్ చేసింది.

Vaibhav Suryavanshi smashed a destructive 50 in just 24 balls against Zimbabwe in U19 World Cup

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 24 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు బౌండరీలతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. భారత్ 11వ ఓవర్ తొలి బంతికి 100 పరుగుల మార్క్‌ను చేరుకుంది. అదే ఓవర్లో, తతండా చిముగోరో బౌలింగ్‌లో ఆయుష్ మ్హాత్రే- 21, వైభవ్ సూర్యవంశీ- 30 బంతుల్లో 52 వికెట్లను కోల్పోయింది.

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో నమోదైన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీల్లో విల్ మలజుక్ అగ్రస్థానంలో ఉన్నాడు. 23 బంతుల్లో 50 పరుగురలు కొట్టాడు. అతని తర్రవాత ఆయుష్ మ్హాత్రే (న్యూజిలాండ్‌పై), వైభవ్ సూర్యవంశీ (జింబాబ్వేపై) చెరో 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. అంతకుముందు బంగ్లాదేశ్‌పై వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో), బెన్ మేయెస్ (స్కాట్లాండ్) 32 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు.

నేటి మ్యాచ్‌లో గెలిస్తే భారత్ అండర్-19 జట్టు సెమీ ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా అదృష్టం కొద్దీ సూపర్ సిక్స్‌కు చేరుకున్న జింబాబ్వేకు భారత్‌తో ఈ పోరు తీవ్ర సవాల్‌ను విసురుతోంది. జింబాబ్వేకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. అటు భారత్ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్స్ చేరుకుంటుంది. ఎటువంటి నంబర్ల గేమ్ తో గానీ, రన్ రేట్ తో గానీ పని ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+