వైరల్ వీడియో: హార్దిక్ పాండ్యా జీవితంలోకి కొత్త నటి!

Viral Video: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. మొదట భార్య నటాషా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొద్దికాలం బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేశారు. అయితే తాజాగా హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దానిని చూసి హార్దిక్ జాస్మిన్‌తో కూడా విడిపోయి, ఒక నటి-మోడల్‌తో కొత్త బంధం మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. జాస్మిన్ వాలియాతో విడిపోయిన తర్వాత, హార్దిక్ ఇప్పుడు ఈ నటితో సంబంధంలో ఉన్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ వీడియోలో కనిపించిన ఆ నటి-మోడల్ ఎవరో తెలుసుకుందాం.

2020లో నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా ఏదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయారు. హార్దిక్ పాండ్యా తన భార్యను మోసం చేశాడని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ జాస్మిన్ వాలియాను విడిచిపెట్టి నటి-మోడల్ మహియెకా శర్మతో ప్రేమలో పడ్డారని పుకార్లు జోరందుకున్నాయి.

Viral Video Hardik Pandya Rumored to be Dating a New Actress After Natasa Split

ఎలా పుకార్లు మొదలయ్యాయి?
ఈ పుకార్లన్నీ ఒక వీడియో రెడ్డిట్‌లో వైరల్ అయినప్పటి నుంచి మొదలయ్యాయి. ఆ వీడియోలో ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వ్యక్తి మసక మసకగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన పోస్టులో జెర్సీ నెంబర్ 33 గురించి ప్రస్తావన వచ్చింది. ఇది హార్దిక్ పాండ్యాకు సంబంధించింది. దీంతో ఆన్‌లైన్లో కొత్త టోర్నమెంట్, కొత్త గర్ల్ ఫ్రెండ్ వంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇది వారి వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని పెంచింది.

సోషల్ మీడియాలో పుకార్లకు ఊతం
హార్దిక్ పాండ్యా, మహియెకా శర్మ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు గుర్తించిన తర్వాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఆ తర్వాత హార్గిక్ పాండ్యా ధరించే రోబ్ గౌన్‌తో మహియెకా కనిపించిన ఒక చిత్రం కూడా వైరల్ అయింది. అయితే మహియెకా క్రికెట్‌కు సంబంధించిన చాలా రీల్స్‌ను లైక్ చేశారు. వాటిలో హార్దిక్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. అందుకే ఇది కేవలం స్నేహం కూడా కావచ్చని కూడా కొందరు అంటున్నారు.

మహియెకా శర్మ ఎవరు?
నివేదిక ప్రకారం.. మోడలింగ్, నటనా రంగంలోకి రాకముందు మహియెకా శర్మ ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్ చదువుకున్నారు. ఆమె తనిష్క్, వివో, యునిక్లో వంటి పెద్ద బ్రాండ్ల కోసం ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలలో నటించారు. ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమెకు మంచి పేరు ఉంది. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే వంటి ప్రఖ్యాత డిజైనర్ల కోసం ఆమె ర్యాంప్ వాక్ చేశారు. 2024లో ఆమెకు ఇండియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో 'మోడల్ ఆఫ్ ది ఇయర్' టైటిల్ కూడా లభించింది.

అధికారిక ధ్రువీకరణ లేదు..
హార్దిక్ పాండ్యా, మహియెకా శర్మ ఈ సంబంధం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతకు ముుందు హార్దిక్ పేరు బ్రిటీష్ గాయని జాస్మిన్ వాలియాతో ముడిపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిద్దరు తరచుగా కలిసి కనిపించేవారు. జాస్మిన్ కూడా హార్దిక్ మ్యాచ్‌లలో అతడిని ప్రోత్సహించడానికి వెళ్లేవారు. ఇప్పుడు అభిమానులు ఈ విషయంపై ఏదైనా అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+