Virat Kohli Dance: కింగ్ ఖాన్‌తో కింగ్ కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్

Virat Kohli Dance: ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ప్రారంభోత్సవ వేడుకకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమయంలో షారుఖ్ చాలా మంది ఆటగాళ్లను వేదికపైకి పిలిచారు. షారుఖ్ ఖాన్ మొదట భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని స్టేజ్ పైకి పిలిచారు. ఐపీఎల్ తొలి సీజన్ విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీతో పాటు యువ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ కూడా వేదికపైకి చేరుకున్నాడు.

డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ
షారుఖ్ ఖాన్ తో కలిసి విరాట్ కోహ్లీ వేదికపై డ్యాన్స్ చేశాడు. ముందుగా రింకూ సింగ్ తో కలిసి షారుఖ్ డ్యాన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ తప్పించుకోవాలనుకున్నాడు కానీ కింగ్ ఖాన్ క్రికెట్ కింగ్ ను వీడలేదు. షారుఖ్ విరాట్ ను డ్యాన్స్ చేయమని అడిగారు. దానికి కోహ్లీ కూడా అంగీకరించాడు. అనంతరం షారుఖ్ చిత్రం పఠాన్ లోని "జూమ్ జో పఠాన్" ప్లే అయింది. ఈ పాటకు విరాట్ కోహ్లీ షారుఖ్ ఖాన్ తో కలిసి డ్యాన్స్ చేశాడు.

Virat Kohli Dance with Shah Rukh Khan at IPL 2025 Opening Video Goes Viral

ప్రారంభోత్సవంలో విరాట్ కోహ్లీ, రింకూ సింగ్ ఇద్దరూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో మాట్లాడారు. యువ ఆటగాడు రింకూ సింగ్ ను జనరేషన్ బోల్డ్ అని.. విరాట్ కోహ్లీని జనరేషన్ గోల్డ్ అని షారుఖ్ ఖాన్ అభివర్ణించారు. అనంతరం షారుఖ్ విరాట్ ను ప్రశ్నలు అడిగారు. తర్వాతి తరం జనరేషన్ బోల్డ్ ఆట పట్ల పదునైన దక్పథాన్ని కలిగి ఉంటుందని.. జనరేషన్ గోల్డ్ జట్టును గెలిపించడానికి ఇంకా ఏమీ అవసరమని అడిగాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ధైర్యవంతులైన తరం చాలా బలంగా ముందుకు వస్తోంది, కానీ పాత తరం ఇంకా ఇక్కడే ఉందన్నాడు. ప్రభావం చూపడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇంకా ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నానని.. రాబోయే సంవత్సరాల్లో ఈ అభిమానులందరికీ మరిన్ని జ్ఞాపకాలను సృష్టించడంలో కొనసాగుతానని ఆశిస్తున్నానన్నారు.

కోహ్లీకి మొమెంటో
ఐపీఎల్ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విరాట్ కోహ్లీని కూడా సత్కరించారు. విరాట్ కోహ్లీకి బీసీసీఐ నుంచి జ్ఞాపిక లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+