కోహ్లీ ర్యాంకు గోవిందా!: నంబర్-1 కిరీటాన్ని ఎగరేసుకుపోయిన కివీస్ స్టార్

ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం వారం రోజుల క్రితమే రోహిత్ శర్మను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని దక్కించుతున్న కింగ్ కోహ్లీ.. ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయారు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ తన అద్భుత ప్రదర్శనతో విరాట్ కోహ్లీని రెండో స్థానానికి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

డారిల్ మిచెల్ ప్రభంజనం
టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ కళ్లు చెదిరే ఫామ్‌ను కనబరిచారు. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం డారిల్ మిచెల్ 845 రేటింగ్ పాయింట్లు కలిగి ఉండగా.. విరాట్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయారు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారిల్ మిచెల్ ఏకంగా 352 పరుగులు సాధించారు. ఇందులో ఒక అజేయ సెంచరీ (131*), ఒక హాఫ్ సెంచరీ (84) ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 352 పరుగులు చేయడం ఒక న్యూజిలాండ్ ఆటగాడికి ఇదే రికార్డు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే బాబర్ ఆజం, శుభ్‌మన్ గిల్ (చెరో 360 పరుగులు) తర్వాత మిచెల్‌దే మూడో స్థానం.

Virat Kohli Loses No 1 ODI Ranking as New Zealand Star Daryl Mitchell Takes the Crown

అగ్రస్థానాన్ని కోల్పోయిన విరాట్ కోహ్లీ
నిజానికి ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగానే ఆడారు. 3 మ్యాచ్‌ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ (124) కూడా ఉంది. కానీ, డారిల్ మిచెల్ అసాధారణ రీతిలో పరుగులు సాధించడంతో కోహ్లీ అగ్రస్థానాన్ని కాపాడుకోలేకపోయారు.

డారిల్ మిచెల్ సాధించిన అరుదైన రికార్డులు
డారిల్ మిచెల్ ఇప్పటివరకు 54 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఒక్కసారి కూడా సున్నా పరుగులకు ఔట్ కాలేదు. వన్డే చరిత్రలో కీప్లర్ వెసెల్స్ (105 ఇన్నింగ్స్‌లు) తర్వాత ఇదే అత్యుత్తమ రికార్డు. వన్డేల్లో నాలుగు సార్లు 130+ స్కోర్లు చేసిన కివీస్ బ్యాటర్‌గా మార్టిన్ గప్టిల్ రికార్డును మిచెల్ సమం చేశారు. భారత్‌లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీయుల జాబితాలో మిచెల్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నారు. ఏబీ డివిలియర్స్ (5 సెంచరీలు) మొదటి స్థానంలో ఉన్నారు.

ర్యాంకింగ్స్‌లో ఇతర ఆటగాళ్లు
ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం మొదటి రెండు స్థానాల్లో మిచెల్, కోహ్లీ ఉండగా.. ఆ తర్వాత వరుసగా ఇబ్రహీం జద్రాన్, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజం నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+