సెంచరీ తర్వాత కొహ్లీ యూటర్న్ ? అగార్కర్ అవుట్..! బీసీసీఐ ఉక్కిరిబిక్కిరి..!
ఓవైపు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వెంటనే కోలుకుని వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా, మరోవైపు ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కొహ్లీ, సత్తా చాటుకున్న రోహిత్, ఇంకోవైపు కొహ్లీని దేశవాళీ టోర్నీల్లో ఆడించాలనే ప్రణాళికలకు దెబ్బ.. ఇలా వరుస పరిణామాల మధ్య బీసీసీఐ ఉక్కిరిబిక్కిరవుతోంది. సెంచరీ తర్వాత కొహ్లీ ఇస్తున్న షాకులతో బీసీసీఐ పరిస్ధితి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ముందు విరాట్ కొహ్లీతో పాటు రోహిత్ శర్మను జట్టులో చోటు కావాలంటే దేశవాళీ టోర్నీలు ఆడక తప్పదని బీసీసీఐ తేల్చేసింది. అయితే ఈ ప్రతిపాదనకు రోహిత్ అంగీకరించగా.. కొహ్లీ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఓ దశలో ఆడక తప్పదనే నిర్ణయానికి కూడా వచ్చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో కొహ్లీ సెంచరీ చేసి సత్తా చాటుకున్నాడు. అటు రోహిత్ కూడా సెంచరీ కొట్టకపోయినా ఫర్వాలేదనిపించాడు. దీంతో వీరిద్దరిపై ఉన్న ఒత్తిడి కాస్తా బీసీసీఐపైకి మళ్లింది.

ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ ఆడాలన్న బీసీసీఐ సూచనను కొహ్లీ తిరస్కరించాడు. దీంతో బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో హెడ్ కోచ్ గంభీర్ తో కొహ్లీకి నెలకొన్న విభేదాల పరిష్కారానికి ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ను పంపాలని బోర్డు భావించింది. కానీ పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోవడంతో కొహ్లీ-గంభీర్ మధ్య రాజీ చర్చల కోసం అగార్కర్ స్ధానంలో మరో సెలక్టర్ ప్రజ్ఞాన్ ఓఝాను మీడియేటర్ గా పంపాలని బోర్డు పంపింది.

దీంతో ఎయిర్ పోర్టులో ముందుగా రోహిత్ తో ప్రజ్ఞాన్ ఓఝా గంభీర్ సమక్షంలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కొహ్లీ మాత్రం లేడు. గంభీర్ తో కొహ్లీ-రోహిత్ ఇద్దరికీ గ్యాప్ పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందు వీరి వివాదాల్ని పరిష్కరిస్తే తప్ప కొహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేమని భావిస్తున్న బీసీసీఐ.. ఈ చర్చలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. గంభీర్ తో వీరిద్దరికీ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతోందన్న ఆందోళన బోర్డులో నెలకొంది. అదే సమయంలో గంభీర్ కు మద్దతుగా నిలుస్తున్న బీసీసీఐ కూడా విమర్శలు ఎదుర్కొంటోంది.
-
స్వదేశంలో టీమిండియా నెక్ట్స్ టోర్నీలివే..! బీసీసీఐ షెడ్యూల్ ప్రకటన..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications