చరమాంకంలో కోహ్లీ చెత్త రికార్డ్ క్రికెట్ చరిత్రలో తొలిసారి
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో వన్డేలో కూడా భారత్.. తడబడుతోంది. ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ల బౌలింగ్ కు దాసోహం అంటోంది. వారి పదునైన బంతులకు బ్యాటర్ల వద్ద సమాధానం ఉండట్లేదు. ఇప్పటికే తొలి వన్డేను కోల్పోయింది టీమిండియా. ఇందులో కూడా పోరాడాల్సి వస్తోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోతోంది. కుదురుకోవడానిక్కూడా వీలు చిక్కట్లేదు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైనదేనని ప్రారంభంలోనే తేలిపోయింది. ఏడో ఓవర్ తొలి బంతికి కేప్టెన్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అవుట్ అయ్యాడు. జేవియర్ బాట్లర్ వేసిన ఓవర్ అది. తొలి బంతిని మిడాఫ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు గిల్. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ డెలివరీని మిడాఫ్ లో కాచుక్కూర్చున్న మార్ష్ అందుకున్నాడు. దీంతో 17 బంతులకు తొలి వికెట్ కోల్పోయింది భారత్.

ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఎంతో సేపు క్రీజ్ లో నిల్చోలేకపోయాడు. నాలుగే నాలుగు బంతులు ఆడిన కోహ్లీ.. డకౌట్ అయ్యాడు. అదే ఓవర్ అయిదో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే క్రీజ్ ను వదల్లేడు కోహ్లీ. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మతో కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాతే క్రీజ్ వదిలి వెళ్ళాడు.
ఆఫ్ స్టంప్స్ పై జేవియర్ వేసిన డెలివరీ అనూహ్యంగా బౌన్స్ అయింది. స్కిడ్ అయ్యి నేరుగా వికెట్లపైకి దూసుకొచ్చింది. దీన్ని అడ్డుకోవడంలో విఫలం అయ్యాడు కోహ్లీ. నేరుగా ఆ డెలివరీ అతని ఫ్రంట్ ప్యాడ్‌ను తాకింది. ఆ వెంటనే జేవియర్ అప్పీల్ చేయడం, అంపైర్ అవుట్ ఇవ్వడం క్షణాల్లో జరిగింది. వరుసగా రెండో వన్డేలో డకౌట్ అయ్యాడు కోహ్లీ. ఇది అతని కేరీర్ లోనే తొలిసారి. ఇలా వరుసగా రెండు వన్డేల్లో ఇప్పటివరకు ఎప్పుడూ బ్యాక్ అండ్ బ్యాక్ డకౌట్ కాలేదతను.












Click it and Unblock the Notifications