IND vs WI: కుప్పకూలిన విండీస్!
IND vs WI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేటి (అక్టోబర్ 2) నుండి ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ బ్యాటర్లు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ అత్యంత నిప్పులు చెరిగే బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ పతనం
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను ఆశించిన స్థాయిలో ప్రారంభించలేదు. 12 పరుగుల వద్దే తొలి వికెట్‌గా తేజ్‌నారాయణ్ చంద్రపాల్ (0) సిరాజ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. ఆ వెంటనే జాన్ కాంప్‌బెల్‌ను (8) బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత సిరాజ్ మరో రెండు వికెట్లు తీసి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టాడు. లంచ్ విరామానికి ముందు కుల్దీప్ యాదవ్, షాయ్ హోప్ వికెట్ తీసి విండీస్‌కు ఐదో దెబ్బ కొట్టాడు. మధ్యలో వాషింగ్టన్ సుందర్ 7వ వికెట్ తీయగా, చివర్లో బుమ్రా, కుల్దీప్ మిగిలిన వికెట్లను పడగొట్టి విండీస్ ఇన్నింగ్స్‌ను 162 పరుగులకే ముగించారు.

వెస్టిండీస్ వికెట్ల పతనం:
12-1 (చంద్రపాల్), 20-2 (కాంప్‌బెల్), 39-3 (కింగ్), 42-4 (అథానాజే), 90-5 (హోప్), 144-7 (ప్యారే), 150-8 (గ్రీవ్స్), 162-10 (వారికన్).
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌లలోనూ అవకాశం దక్కించుకోని కుల్దీప్ కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కింది.
భారత ప్లేయింగ్ ఎలెవెన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవెన్:
తేజ్‌నారాయణ్ చంద్రపాల్, జాన్ కాంప్‌బెల్, అలిక్ అథానాజే, బ్రాండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖైరీ పీయర్, జోహాన్ లెన్, జేడన్ సీల్స్.












Click it and Unblock the Notifications