IPL 2026 Auction: 77 ప్లేయర్లపై 215 కోట్ల ఖర్చు..! టాప్ జట్లు, రికార్డులివే..!
ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల ఖాళీల్ని భర్తీ చేసేందుకు నిన్న అబుదాబీ వేదికగా జరిగిన మినీ వేలం ఎట్టకేలకు ముగిసింది. ఈ మొత్తం వేలాన్ని ఓసారి పరిశీలిస్తే పలు కీలక అంశాలు తెలిశాయి. అలాగే పలు రికార్డులూ బద్దలయ్యాయి. జట్లతో పాటు ఆటగాళ్లు కూడా వేలంలో నమోదైన రికార్డుల్లో పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ మినీ వేలంలో నమోదైన సంచలనాలను రికార్డుల్ని ఓసారి చూసేద్దాం..
ఈసారి ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 369 ఆటగాళ్ల భవితవ్యం తేల్చేందుకు అబుదాబీలో అన్ని జట్ల యాజమాన్యాలు హాజరయ్యాయి. ఈ మొత్తం వేలంలో 77 మంది ఆటగాళ్లను మాత్రమే వివిధ జట్లు కొనుగోలు చేశాయి. మిగిలిన ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ఈ మొత్తం వేలంలో ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం అన్ని జట్లు పెట్టిన ఖర్చు విలువ రూ.215.45 కోట్లుగా నమోదైంది. ఇందులో ఊహించినట్లుగానే చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు టాప్ లో నిలిచాయి.

ఈసారి వేలంలో అత్యంత ఖరీదైన కొనుగోళ్ల ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స, చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం చెలాయించాయి. టాప్ 4 కొనుగోళ్లు చేసింది ఈ రెండు జట్లే. ఇందులో కోల్ కతా విదేశీ ఆటగాళ్ల కోసం ఎక్కువగా ఖర్చు చేసింది. వీరిలో కామెరూన్ గ్రీన్, మతీష పతిరానా,, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉన్నారు. అలాగే సీఎస్కే కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ వంటి భారతీయ ఆటగాళ్లను భారీ ఖర్చుపెట్టి కొనుక్కుని సంచలనం రేపింది. అలాగే ఈ రెండు జట్లూ చాలా క్రికెటర్ల కోసం హోరాహోరీ తలపడ్డాయి.
IPL 2026 వేలంలో అత్యంత ఖరీదైన 10 విదేశీ కొనుగోళ్లు
1. కామెరాన్ గ్రీన్ - కోల్ కతా- రూ.25.20 కోట్లు
2. మథీషా పతిరానా -కోల్ కతా- రూ.18 కోట్లు
3. లియామ్ లివింగ్‌స్టోన్-హైదరాబాద్ -రూ.13 కోట్లు
4.ముస్తాఫిజుర్ రెహమాన్ -కోల్ కతా-రూ.9.20 కోట్లు
5. జోష్ ఇంగ్లిస్ -లక్నో-రూ.8.60 కోట్లు
6. జాసన్ హోల్డర్-గుజరాత్-రూ.7 కోట్లు
7. బెన్ డ్వార్షుయిస్- పంజాబ్-రూ.4.40 కోట్లు
8. పాతుమ్ నిస్సంక -ఢిల్లీ-రూ.4 కోట్లు
9. కూపర్ కనోలీ-పంజాబ్-రూ.3 కోట్లు
10. జాక్ ఎడ్వర్డ్స్ -హైదరాబాద్-రూ.3 కోట్లు

టాప్ 6 అన్ క్యాప్ కొనుగోళ్లు
1. ప్రశాంత్ వీర్ -చెన్నై-రూ.14.20 కోట్లు
2. కార్తీక్ శర్మ -చెన్నై-రూ.14.20 కోట్లు
3. అకీబ్ నబీ దార్ -ఢిల్లీ-రూ.8.40 కోట్లు
4. మంగేష్ యాదవ్-బెంగళూరు-రూ.5.20 కోట్లు
5. తేజస్వి సింగ్ -కోల్ కతా-రూ.3 కోట్లు
5. జాక్ ఎడ్వర్డ్స్ -హైదరాబాద్-రూ.3 కోట్లు
టాప్ 10 ఖరీదైన కొనుగోళ్లు
1. కామెరాన్ గ్రీన్ -కోల్ కతా-రూ.25.20 కోట్లు
2. మతీషా పతిరానా-కోల్ కతా-రూ.18 కోట్లు
3. ప్రశాంత్ వీర్ -చెన్నై-రూ.14.20 కోట్లు
4. కార్తీక్ శర్మ-చెన్నై- రూ.14.20 కోట్లు
5. లియామ్ లివింగ్‌స్టోన్ -హైదరాబాద్-రూ.13 కోట్లు
6. ముస్తాఫిజుర్ రెహమాన్ -కోల్ కతా-రూ.9.20 కోట్లు
7. జోష్ ఇంగ్లిస్ -లక్నో-రూ.8.60 కోట్లు
8. అకీబ్ నబీ దార్-ఢిల్లీ-రూ.8.40 కోట్లు
9. రవి బిష్ణోయ్ -రాజస్తాన్-రూ.7.20 కోట్లు
10. వెంకటేష్ అయ్యర్-బెంగళూరు-రూ.7 కోట్లు
10. జాసన్ హోల్డర్ -గుజరాత్-రూ. 7 కోట్లు
-
యష్ దయాళ్ కు ఉద్వాసన పలికిన ఆర్సీబీ? -
IPL 2026: ఆర్సీబీని కొహ్లీ ఛార్టర్డ్ విమానం అడిగాడా ? స్వయంగా క్లారిటీ..! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్












Click it and Unblock the Notifications