చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడటం కష్టం

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఐపీఎల్ ప్రయాణం ముగిసిందని తేల్చి చెప్పాడు. ఇతర లీగ్‌లలో కొనసాగుతానని పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్ ముగియడం.. ఓ కొత్త ప్రయాణానికి నాంది పలికుతుందని అశ్విన్ తెలిపాడు.

ఇదివరకే అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మట్ నుంచి గతంలోనే తప్పుకొన్నాడు. ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. తాజాగా ఈ లీగ్ నుంచి కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఓ శకం ముగిసినట్టయింది.

Why Ravichandran Ashwin Chose to Step Away from the IPL

రిటైర్మెంట్ ప్రకటించిన ఈ సందర్భాన్ని ఓ ప్రత్యేకమైన రోజు అభివర్ణించాడు రవిచంద్రన్ అశ్విన్. ఓ సరికొత్త ప్రయాణానికి ఇది ఆరంభం అని వ్యాఖ్యానించాడు. ప్రతి ముగింపునకూ ఓ కొత్త ఆరంభం ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ క్రికెటర్‌గా తన ప్రయాణం నేటితో ముగిసిందని, ఇతర లీగ్‌లలో ఆడటానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

తాజాగా దీనికి గల కారణాలను వెల్లడించాడీ ఆల్ రౌండర్. విదేశీ లీగ్‌లలో ఆడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకు విదేశీ లీగ్స్ ఆడలేదని గుర్తు చేశాడు. ఇప్పటివరకు అలాంటి మార్గాల్లో ప్రయాణించలేదని, కొత్త రూట్లల్లో వెళ్లాలనేదే తన జీవిత విధానని వివరించాడు.

తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కెరీర్ చివరి దశలో విదేశీ లీగ్స్ ఆడాలనుకుంటోన్నానని, దీనికోసం సమయాన్ని కేటాయించడానికే ఐపీఎల్ నుంచి వైదొలగినట్లు తెలిపాడు. క్రికెట్ తన జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

ఐపీఎల్‌లో ఆడటం వల్ల కలిగే మానసిక, శారీరక శ్రమను ఆయన "డ్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్" అని అభివర్ణించారు. "తదుపరి సీజన్‌లో నేను ఐపీఎల్ ఆడాలా వద్దా అని ఆలోచించాను. మూడు నెలల ఐపీఎల్ చాలా ఎక్కువగా అనిపించింది. ఆడాలని ఉన్నా.. శరీరకంగా, మానసికంగా అలసిపోవాల్సి వస్తుంది.." అని అశ్విన్ అన్నాడు.

తాను ఇప్పటికే ఒక విదేశీ లీగ్‌లో పేరు నమోదు చేసుకున్నానని అశ్విన్ వెల్లడించాడు. ఆ టోర్నమెంట్ ఏమిటనేది బయటపెట్టలేదు. విదేశాలకు వెళ్లి ఆడితే, మంచి అనుభూతులు లభిస్తాయని, ఎవరూ గుర్తించనందున సరదాగా వీధుల వెంట తిరగొచ్చని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+