మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ రిలీజ్..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మెగా టోర్నీకి టైమ్ ఫిక్స్ అయ్యింది. మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈరోజు ( జూన్ 18, 2025 బుధవారం ) అధికారికంగా విడుదల చేసింది. 2026లో ఇంగ్లండ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ ప్రపంచ కప్ జూన్ 12, 2026న ప్రారంభమవనుండగా.. జూలై 5న లార్డ్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. మొత్తం 24 రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది.

ఈసారి టీ20 ప్రపంచ కప్ లో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా న్యూజిలాండ్‌ బరిలోకి దిగుతోంది.

womens-t20-world-cup-2026-schedule-released

అలానే ఈ టోర్నీ కోసం 7 వేదికలు ఫిక్స్ చేశారు. వాటిలో ఎడ్జ్‌బాస్టన్‌, హాంప్‌షైర్ బౌల్‌, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్‌, ది ఓవల్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, లార్డ్స్‌ ఉన్నాయి. మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ముఖ్యంగా భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగనుంది.

భారత్ మ్యాచ్ షెడ్యూల్..

జూన్ 14: భారత్ vs పాకిస్తాన్

జూన్ 17: భారత్ vs క్వాలిఫయర్

జూన్ 21: భారత్ vs దక్షిణాఫ్రికా

జూన్ 25: భారత్ vs క్వాలిఫయర్

జూన్ 28: భారత్ vs ఆస్ట్రేలియా

2026 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియన్ టీమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సహా పలువురు స్టార్ ప్లేయర్లు భారత్‌ను విజయబాటలో నడిపించగలరా?
జూన్ 14న పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏం జరుగుతుంది? అని జోరుగా చర్చ నడుస్తోంది.

పూర్తి షెడ్యూల్..

జూన్ 12 (శుక్రవారం) - ఇంగ్లండ్ vs శ్రీలంక - ఎడ్జ్‌బాస్టన్

జూన్ 13 (శనివారం) - క్వాలిఫయర్ vs క్వాలిఫయర్ - ఓల్డ్ ట్రఫోర్డ్

జూన్ 13 (శనివారం) - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - ఓల్డ్ ట్రఫోర్డ్

జూన్ 13 (శనివారం) - వెస్టిండీస్ vs న్యూజిలాండ్ - హాంప్‌షైర్ బౌల్

జూన్ 14 (ఆదివారం) - క్వాలిఫయర్ vs క్వాలిఫయర్ - ఎడ్జ్‌బాస్టన్

జూన్ 16 (మంగళవారం) - న్యూజిలాండ్ vs శ్రీలంక - హాంప్‌షైర్ బౌల్

జూన్ 16 (మంగళవారం) - ఇంగ్లండ్ vs క్వాలిఫయర్ - హాంప్‌షైర్ బౌల్

జూన్ 17 (బుధవారం) - ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ - హెడ్డింగ్లీ

జూన్ 17 (బుధవారం) - దక్షిణాఫ్రికా vs పాకిస్తాన్ - ఎడ్జ్‌బాస్టన్

జూన్ 18 (గురువారం) - వెస్టిండీస్ vs క్వాలిఫయర్ - హెడ్డింగ్లీ

జూన్ 19 (శుక్రవారం) - న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ - హాంప్‌షైర్ బౌల్

జూన్ 20 (శనివారం) - ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ - హాంప్‌షైర్ బౌల్

జూన్ 20 (శనివారం) - ఇంగ్లండ్ vs క్వాలిఫయర్ - హెడ్డింగ్లీ

జూన్ 21 (ఆదివారం) - వెస్టిండీస్ vs శ్రీలంక - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 23 (మంగళవారం) - న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 23 (మంగళవారం) - శ్రీలంక vs క్వాలిఫయర్ - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 23 (మంగళవారం) - ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ - హెడ్డింగ్లీ

జూన్ 24 (బుధవారం) - ఇంగ్లండ్ vs వెస్టిండీస్ - లార్డ్స్

జూన్ 25 (గురువారం) - దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 26 (శుక్రవారం) - శ్రీలంక vs క్వాలిఫయర్ - ఓల్డ్ ట్రఫోర్డ్

జూన్ 27 (శనివారం) - పాకిస్తాన్ vs క్వాలిఫయర్ - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 27 (శనివారం) - వెస్టిండీస్ vs క్వాలిఫయర్ - బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్

జూన్ 27 (శనివారం) - ఇంగ్లండ్ vs న్యూజిలాండ్ - ది ఓవల్

జూన్ 28 (ఆదివారం) - దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ - లార్డ్స్

జూన్ 30 (మంగళవారం) - సెమీ ఫైనల్ 1 - ది ఓవల్

జూలై 2 (గురువారం) - సెమీ ఫైనల్ 2 - ది ఓవల్

జూలై 5 (ఆదివారం) - ఫైనల్ - లార్డ్స్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+