అంతా బాగానే ఉంది గానీ.. మధ్యలో మీ ఫొటో ఎందుకు జీవీఎల్ సర్..!!
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర.. బ్రేకుల్లేని బండిలా సాగుతోంది. మరో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరార్ చేసుకుంది. ఈ టోర్నమెంట్ సెమీస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా తన పేరును లిఖించుకుంది.
గురువారం రాత్రి అచ్చొచ్చిన ముంబై వాంఖెడే స్టేడియంలో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది రోహిత్ సేన. ఏకంగా 302 పరుగుల తేడాతో విజయదుందుభిని మోగించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

కేప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. శుభ్‌మన్ గిల్- 92, విరాట్ కోహ్లీ- 88, శ్రేయాస్ అయ్యర్- 82 పరుగులతో సత్తా చాటారు. ఈ ముగ్గురూ స్వల్ప తేడాతో సెంచరీని మిస్ అయ్యారు. 358 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ పోరాడలేకపోయింది. బౌలర్ల ధాటికి 55 పరుగుల వద్దే కుప్పకూలింది.
రవీంద్ర జడేజా వేసిన 20వ ఓవర్ నాలుగో బంతిని స్లాగ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు మధుశంక. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచిన ఆ బంతిని మిడాన్ సర్కిల్‌లో శ్రేయాస్ అయ్యర్ అందుకోవడంతో శ్రీలంక ఇన్నింగ్‌కు తెరపడింది. మొత్తం 55 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. దీనితో జట్టులో విజయోత్సవాలు వెల్లివిరిశాయి.
Amidst the electrifying World Cup fervor, Bharat’s 🇮🇳 triumph over Srilanka at the Wankhede Stadium was a breathtaking showcase of our cricketing maestro’s sublime skills.
— GVL Narasimha Rao (@GVLNRAO) November 2, 2023
World Cup thrill at its finest! Well played, champs! 🏏#WorldCup #WorldCup2023india #IndianCricketTeam pic.twitter.com/XT0xbIeSRK
దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జట్టు సాధించిన ఘన విజయాన్ని ప్రశంసించారు. శ్రీలంకపై భారత్ సాధించిన విజయం దేశం సత్తా చాటిందని కితాబిచ్చారు. దీన్ని ప్రపంచ కప్‌లోనే బెస్ట్ మ్యాచ్‌గా అభివర్ణించారు.
అంతా బాగుంది.. మధ్యలో నీ ఫోటో ఎందుకు అంకుల్??? https://t.co/n79yNgUwpZ
— Suma Tiyyagura (Manvitha) (@SumaTiyyaguraa) November 2, 2023
ఈ వీడియోపై ఓ మూల తన ఫొటోను ప్రింట్ చేయించుకున్నారు జీవీఎల్. ఇది కాస్తా విమర్శలకు దారి తీసింది. దీనిపై సెటైర్లు సంధిస్తోన్నారు నెటిజన్లు. అంతా బాగుంది గానీ.. మధ్యలో జీవీఎల్ ఫొటో ఎందుకంటూ నిలదీస్తోన్నారు. స్టేడియంలో సీటు దొరలేదని డైరెక్ట్‌గా టీవీలో కూర్చునట్టుంది అంటూ కామెంట్స్ పెట్టారు.
Stadium lo seat dorkaledh ani direct ga tv lo kurchunaru sir garu 😭
— Toor Daal 🥣 (@Interfail25) November 2, 2023
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications