World Cup Final 2023: అహ్మదాబాద్ లో భారీ డిమాండ్- హోటల్ రూమ్ లక్ష-ఫ్లైట్ టికెట్ 35 వేలు..
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్ ఆదివారం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్రమోడీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతోంది. టోర్నీలో ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ లనూ గెలిచి జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అలాగే సెమీస్ లో పటిష్టమైన దక్షిణాఫ్రికాపై ఏకపక్షంగా గెలిచిన ఆస్ట్రేలియా కూడా మరో వరల్డ్ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ కు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ క్యూ కట్టారు.
అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ చూడాలని తహతహలాడుతున్న వీఐపీలు ఇప్పుడు గుజరాత్ కు క్యూ కట్టారు. దీంతో అహ్మదాబాద్ లో ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హోటల్ రూమ్ లతో పాటు అహ్మదాబాద్ కు వెళ్లే విమానాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. భారత్-ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.

అహ్మదాబాద్ లో ప్రస్తుతం హోటల్ రూమ్ లన్నీ బుక్ అయిపోయాయి. అలాగే అహ్మదాబాద్ కు వెళ్లే విమానాల టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. దీంతో బ్లాక్ మార్కెటింగ్ మొదలైపోయింది. ఇప్పుడు అహ్మదాబాద్ లో హోటల్ రూమ్ కావాలంటే లక్ష రూపాయలు పలుకుతోంది. అలాగే ఫ్లైట్ టికెట్ కూడా 35 వేల వరకూ ఉంది. దీంతో ఆ మేరకు చెల్లించి నగరానికి చేరుకునేందుకు వీఐపీలు సిద్ధమైపోతున్నారు. ఎలాగైనా భారత్ టైటిల్ కొట్టే క్షణాల్ని స్వయంగా తిలకించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
2003 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..??#TeamIndia #Australia #INDvsAUS #AUSvsIND #CWC2023Final #CWC2023 #CWC23 #CWC2023INDIA #ICCCricketWorldCup2023 #ICCMensCricketWorldCup2023 #ICCCricketWorldCup23 #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) November 17, 2023
అహ్మదాబాద్ కు ఒక్కరోజు ముందే చేరుకునేందుకు ప్రేక్షకులు తరలివస్తున్నారు. దీంతో రేపటి నుంచే అహ్మదాబాద్ లో రద్దీ పెరిగిపోనుంది. మ్యాచ్ రోజుకు ముందే నగరానికి చేరుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు తప్పుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. దీంతో నగరంలో హోటళ్లతో పాటు ఆహార పదార్ధాల ధరలు కూడా మండిపోతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాని మోడీ కూడా తరలిరానున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు కూడా జనం పోటీ పడనున్నారు.












Click it and Unblock the Notifications