WPL 2026: డీ క్లెర్క్ ఆల్‌రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు షాక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ లారెన్ బెల్ వేసిన తొలి ఓవర్ మెయిడెన్ కావడంతో ముంబై ఒత్తిడిలో పడింది. అమెలియా కెర్ (0), నాట్ సీవర్ బ్రంట్ (12) త్వరగా ఔట్ కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సజీవన్ సజన (25 బంతుల్లో 45, 7 ఫోర్లు, 1 సిక్స్), నికోలా కేరీ (29 బంతుల్లో 40) ఆరో వికెట్‌కు 82 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి మెరుపులతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 154/6 గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో నదిన్ డీ క్లెర్క్ 4 వికెట్లతో చెలరేగింది.

ఛేజింగ్‌లో ఆర్సీబీ ధీటుగా..
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ముంబై బౌలర్లు గట్టి పోటీ ఇచ్చారు. అయితే ఆల్ రౌండర్ నదిన్ డీ క్లెర్క్ బౌలింగ్‌లో మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి జట్టును గెలిపించింది. ఆఖరి ఓవర్లో విజయం కోసం కఠిన సమీకరణం ఉన్నప్పటికీ.. ఆర్సీబీ బ్యాటర్లు సమన్వయంతో ఆడి ముంబై ఇండియన్స్‌ను ఓడించారు. ఆఖరి ఓవర్లో డీ క్లెర్క్ మెరుపులు మెరిపించింది. చివరి ఓవర్లో చివరి 4 బంతుల్లో 6,4, 6,4 బాది జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్ లో నదిన్ డీ క్లెర్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది. గత సీజన్ ఛాంపియన్ ముంబైపై సాధించిన ఈ విజయం ఆర్సీబీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. రేపు జరగబోయే మ్యాచ్‌లో యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications