రాజీనామా చేసిన వినేష్ ఫొగట్

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌‌.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారు. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతోన్నారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు.

ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్‌ ఫైనల్స్‌ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

Wrestler Vinesh Phogat resigns from her post in Railways

నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.

తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.

ఈ పరిస్థితుల మధ్య ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోండటం సంచలనం రేపుతోంది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో రెండు రోజుల కిందటే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు. అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు.

ఈ పరిణామాల మధ్య మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు వినేష్ ఫొగట్. రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. నార్తర్న్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ / స్పోర్ట్‌ లెవెల్ 7 గా రైల్వేలో పని చేస్తోన్నారామె. సాధారణంగా క్రీడాకారులందరికీ ఏదో ఒక సంస్థ ఉద్యోగాన్ని ఇస్తుంటుంది. వారికి నెలవారీ వేతనాన్ని చెల్లిస్తుంటుంది.

తాజాగా రాజకీయాల్లో అడుగు పెట్టబోతోన్నందున రైల్వే ఓఎస్డీ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌కు పంపించారు. ఇన్ని రోజులు తనకు ఉద్యోగాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి గల కారణాలను వెల్లడించలేదు.

త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయడం లాంఛనప్రాయమే. ఇప్పటికే 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో వారిద్దరి పేర్లు లేవు. కాంగ్రెస్‌లో అధికారికంగా చేరితే మలి విడత జాబితాలో వాళ్లకు టికెట్ ఖరారు కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+