రోహిత్ శర్మ పేరు మీద చెరిగిపోని రికార్డ్
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఆ దేశ జట్టుతో చిట్టచివరి టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ ముగిశాయి. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. చివరిదైన రెండో మ్యాచ్ 3వ తేదీన ఆరంభం కానుంది.
టీ20, వన్డేలకు దూరమైన రోహిత్ శర్మ.. టెస్టులకు అందుబాటులోకి వచ్చాడు గానీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్‌లో అయిదు, రెండో ఇన్నింగ్‌లో డకౌట్ అయ్యాడీ హిట్ మ్యాన్. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్స్ తరువాత బ్యాట్ పట్టుకున్న రోహిత్ శర్మపై పెట్టుకున్న అంచనాలన్నీ ఈ మ్యాచ్‌లో తలకిందులయ్యాయి.

ఇక రెండో టెస్ట్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తి రేపుతోంది. 2023 ఓ రకంగా రోహిత్ శర్మకు చేదు జ్ఞాపకాన్నేమిగిల్చింది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో చవి చూసిన ఓటమి ఇంకా అతన్ని వెంటాడుతూ ఉన్నట్టే అనిపించింది. లీగ్స్, సెమీ ఫైనల్స్‌లో చెలరేగిన భారత జట్టు తీరా ఫైనల్స్‌లో చతికిలపడటాన్ని అభిమానులెవరూ జీర్ణించుకోలేని విషయం.
ఆ ఫైనల్స్ ఒక్కటి పక్కన పెడితే- జట్టుకు అత్యధిక విజయాలను అందించిన కేప్టెన్‌గా రికార్డు సాధించాడు రోహిత్ శర్మ. ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ వరకు ఒకట్రెండు మినహా వరుస మ్యాచ్‌లల్లో జట్టును గెలిపించగలిగాడు. ఈ ఏడాదిలో అత్యధిక మ్యాచ్‌లను గెలిపించిన కేప్టెన్ రోహిత్ ఒక్కడే.
ఈ సంవత్సరం అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ సైతం రోహిత్ శర్మే. ఈ ఏడాది మొత్తం మీద 479 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. 573 సిక్సర్లు కొట్టాడు. ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లను బాదిన బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డ్ వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉండేది. 551 ఇన్నింగ్స్‌లల్లో గేల్ 553 సిక్సర్లు కొట్టాడు.












Click it and Unblock the Notifications