ఏం గుండెరా అది: న్యూజిలాండ్ పై సెంచరీ బాదిన 19 ఏళ్ల అనామక కుర్ర క్రికెటర్- మరో యూవీ
టీ20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ డీ లో భాగంగా చెన్నై చెపాక్ లోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యార్ లో కెనడా అదరగొడుతోంది. అది కూడా న్యూజిలాండ్ పై. శక్తిమంతమైన న్యూజిలాండ్ బౌలర్ల తుక్కు రేగ్గొడుతోంది. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో కెనడా కుర్ర క్రికెటర్ యువరాజ్ సమ్రా.. సెంచరీ సాధించాడు. 19 సంవత్సరాల వయసులోనే ఈ ఘనత సాధించాడు యువరాజ్. ఓ టీ20 వరల్డ్ కప్ లో ఇంత చిన్న వయస్సులో 100 పరుగులు బాదడం ఇదే తొలిసారి.
ఓపెనర్ గా బరిలోకి దిగిన యువరాజ్.. 65 బంతుల్లో 110 పరుగులు కొట్టాడు. ఇందులో ఆరు భారీ సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇది రెండో సెంచరీ. శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశ్శంక.. ఆస్ట్రేలియాపై సెంచరీ బాదిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ కు దిగిన కెనడా ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. యువరాజ్ సమ్రా, దిలీప్ బజ్వా ఇన్నింగ్ ఆరంభించారు. బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 13 ఓవర్లలోనే స్కోర్ వంద దాటింది.

తొలి వికెట్ భాగస్వామ్యానికి 116 పరుగులు జోడించారంటే వారి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 13.6 ఓవర్ లో దిలీప్ బజ్వా అవుట్ అయ్యాక కూడా ఈ ప్రభంజనానికి బ్రేకులు పడలేదు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న యువరాజ్ చెలరేగాడు. భారీ షాట్లతో తడాఖా చూపాడు. అతని బ్యాటింగ్ ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రత్యేకించి- కైలె జెమిసన్, జేమ్స్ నీషమ్, కోల్ మెక్ కోంచీ.. ఓవర్ కు 10 పరుగులు చొప్పున సమర్పించుకోవాల్సి వచ్చింది.
110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద యువరాజ్ అవుట్ అయ్యాక.. స్కోర్ కొంత మందగించింది. నవ్ నీత్ ధలివాల్- 10, నికొలస్ కీర్టన్- 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. హర్ష్ థాకెర్- 3, డిలాన్ హెలింగర్- 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగుుల చేసింది కెనడా. న్యూజిలాండ్ కు 174 పరుగులను నిర్దేశించింది. న్యూజిలాండ్ లో మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైలే జెమిసన్, జేమ్స్ నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.












Click it and Unblock the Notifications